Man Shoots Girlfriend: గాళ్‌ఫ్రెండ్‌ని గన్‌తో కాల్చి పారిపోబోయాడు.. ఇంతలోనే..

Man Kills His Girlfriend: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఏడాది పాటు లవ్ చేసుకున్నారు. కానీ లవ్ మ్యాటర్ కాస్తా పెళ్లి వరకు రావడంతో జేబులోంచి రివాల్వర్ తీసి ఆ అమ్మాయి నుదుటన రివాల్వర్ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజులో షూట్ చేశాడు.

Last Updated : Sep 30, 2022, 02:00 AM IST
  • తమది ప్రేమ బంధం అని నమ్మించాడు..
  • పెళ్లి ప్రస్తావన రావడంతో నిజ స్వరూపం చూపించాడు
  • గాళ్‌ఫ్రెండ్‌ని గన్‌తో షూట్ చేసి పారిపోవాలనుకున్నాడు..
  • కానీ ఇంతలోనే ఊహించని పరిణామం..
Man Shoots Girlfriend: గాళ్‌ఫ్రెండ్‌ని గన్‌తో కాల్చి పారిపోబోయాడు.. ఇంతలోనే..

Man Shoots His Girlfriend: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఏడాది పాటు చట్టాపట్టాలేసుకుని కలిసి తిరిగారు. గాళ్ ఫ్రెండ్ ఇంట్లో ఈ విషయం తెలిసిపోవడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లి గురించి ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంట్లో తనపై ఫోర్స్ పెరగడంతో ఆ అమ్మాయి కూడా మన పెళ్లి సంగతేంటని బాయ్ ఫ్రెండుని నిలదీసింది. ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి పెరుగుతున్నందున తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బాయ్ ఫ్రెండుపై ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ గాళ్ ఫ్రెండును పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ యువకుడు అందుకు ససెమిరా ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పేశాడు. అప్పుడు కానీ ఆ అమ్మాయికి అర్థం కాలేదు అతడి అసలు నిజ స్వరూపం. కానీ ఇంట్లో అసలు విషయం తెలిసిపోయింది కనుక ఎలాగైనా బాయ్ ఫ్రెండుని ఒప్పించి అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అందుకు అతడితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. విచక్షణ కోల్పోయిన యువకుడు ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కసారి చెబితే నీకు అర్థం కావడం లేదా అంటూ జేబులోంచి రివాల్వర్ తీసి ఆ అమ్మాయి నుదుటన రివాల్వర్ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజులో షూట్ చేశాడు.

ఊహించని పరిణామానికి షాకైన అమ్మాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బుల్లెట్ నుదుటిలోకి దిగింది. నడి రోడ్డుపై తుపాకీ కాల్పుల శబ్ఘం విన్న చుట్టుపక్కల వాళ్లు, స్థానికులు ఏం జరుగుతుందో అర్థంకాక ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే వాళ్లిద్దరివైపు పరిగెత్తుకొచ్చారు. అప్పటికే అమ్మాయి రక్తపు మడుగులో పడి కొట్టుకుంటూ ప్రాణాలొదిలింది. స్థానికులు తనవైపే రావడం చూసిన యువకుడు.. అక్కడి నుంచి వెంటనే జారుకోకపోతే తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్నాడు. తప్పు చేశానన్న భయంతో అక్కడి నుండి పరుగు అందుకున్నాడు. వారి నుంచి తప్పించుకోవాలనే ఆత్రుతలో రోడ్డుపై అటు ఇటు పరుగెడుతున్న యువకుడికి ఉన్నట్టుండి ఊహించని పరిణామం ఎదురైంది. అమ్మాయిని కాల్చి చంపి పారిపోతున్న యువకుడిని అదే సమయంలో అటుగా వేగంగా వచ్చిన ఓ మిలిటరీ వాహనం ఢీకొట్టింది.

గాళ్ ఫ్రెండ్‌ని మర్డర్ చేసి పారిపోయే క్రమంలో ఆ యువకుడు తనకు తెలియకుండానే మిలిటరీ వాహనం కిందపడి ప్రాణాలొదిలాడు. తనకు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తన గాళ్ ఫ్రెండ్ తరహాలోనే కన్నుమూశాడు. అతడిని రక్షించేందుకు పోలీసులు హుటాహటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే అతడు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. 

మహారాష్ట్రలోని బోయిసర్ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో 25 ఏళ్ల క్రిష్ణ యాదవ్, 21 ఏళ్ల నేహ మహతో.. ఇద్దరూ కొన్ని మీటర్ల దూరంలోనే.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మృతి చెందారు. క్రిష్ణ యాదవ్ వద్ద నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ రివాల్వర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. క్రిష్ణ యాదవ్‌ది ప్రమాదవశాత్తుగా సంభవించిన మరణమా లేక ఆత్మహత్యనా అని తెలుసుకునేందుకు ప్రస్తుతం అతడి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వేచిచూస్తున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిని వాడుకుని వదిలేయాలనుకున్నాడు.. పెళ్లి ప్రస్తావన రావడంతో అమ్మాయిని వదిలించుకోవాలనుకున్నాడు.. కానీ ఆఖరికి ఆ మోసానికే బలయ్యాడు. 

Also Read : Man Buried Alive: పైసల కోసం ప్రాణం ఉండగానే యువకుడిని పాతిపెట్టారు

Also Read : Kidneys Theft: ఆస్పత్రికి వెళ్లిన మహిళ రెండు కిడ్నీలు మాయం.. అవయవాల దొంగల ముఠా పనేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News