Man Named Padmaraju Died due to Cock fight Knife: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వస్తే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర అంత ఎక్కువగా కోడిపందాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఉపయోగ గోదావరి జిల్లాల్లో ఈ కోడిపందాలు మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పండుగ పూట కోడిపందాల కారణంగా ఒక నిండు ప్రాణం బలైంది. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. కోడి కత్తి గుచ్చుకుని ఒక యువకుడు తీవ్రంగా గాయపడగా పోటీలు నిర్వహిస్తున్న వారు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు.
దీంతో అప్పటివరకు కోడిపందాలతో కోలాహలంగా కనిపించిన ఆ ప్రాంతమంతా ఒక మృతితో ఒక్కసారిగా తీవ్ర విషాదానికి గురైంది. నల్లజర్ల మండలం అనంత పల్లి లో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపినట్లయింది. నల్లజర్ల మండలం అనంత పల్లి లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందాలు నిర్వహించేందుకు కొన్ని బరులు ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలోనే ఉండే పద్మరాజు అనే యువకుడు కోడిపందాలు వీక్షించడానికి వచ్చాడు, అక్కడ ఉన్నవారందరితో కలిసి కోడిపందాలు చూస్తున్న సమయంలో తోపులాట చోటు చేసుకోవడంతో ప్రమాదవశాత్తు కోడి కత్తి పద్మరాజుకు గుచ్చుకుంది.
దీంతో తీవ్రంగా గాయపడిన పద్మరాజు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే కోడి పందాల నిర్వాహకులు కోడిపందాలకు చూడడానికి వచ్చిన కొంతమంది అతన్ని నల్లజర్ల ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలేశాడు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన గురించి వివరాలు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే పద్మరాజుకి కోడి కత్తి ప్రమాదవశాత్తు గుచ్చు కుందా? లేక ఎవరైనా కావాలని గుచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం మీద పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. వాస్తవానికి కోడిపందాల నిర్వహణ చట్ట విరుద్ధం అయినా సరే సంక్రాంతి సంబరాలు, సంప్రదాయాల పేరుతో రాజకీయ నాయకులు సైతం ఈ పందాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ విషయాన్ని పోలీసులు ఎలా సమర్ధించుకుంటారో చూడాల్సి ఉంది.
Also Read: Sankranthi Directors: ఆశించాను కానీ ఊహించలేదు..ఆజన్మాంతం గుర్తు ఉండిపోతుందంటున్న గోపీచంద్-బాబీలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook