Truck-Bus collision in Pune: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నార్హే-అంబేగావ్ ప్రాంతంలోని పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగింది. సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
సతారా నుంచి థానేలోని డోంబివిలి వెళ్తున్న ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు స్వామినారాయణ దేవాలయం సమీపంలోకి రాగానే ట్రక్కు ఢీకొట్టింది. క్షతగాత్రులను పూణేలోని నవాలే హాస్పిటల్, దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ మరియు సాసూన్ హాస్పిటల్‌తో సహా పలు ఆసుపత్రులకు తరలించారు. స్వల్ప గాయాలైన వారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుతాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ట్రక్కు క్యాబిన్ పూర్తి ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్స్ అందరూ గాఢ నిద్రలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
Also Read: Poonch Terror Attack: పూంచ్‌లో మరోసారి టెర్రర్ ఎటాక్.. ఐదుగురు సైనికుల మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook