Fake Death Certificates: కామారెడ్డి జిల్లాలో ఫేక్ డెత్ సర్టిఫికెట్స్ బాగోతం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్‌కు చెందిన బోడ రాంచందర్ అనే రైతు 2018లో తన ట్రాక్టర్ TS17A1635 ను నిజామబాద్‌లో ఒక షోరూంలో ఇచ్చి ఎక్చేంజ్ కింద వేరే ట్రాక్టర్ తీసుకున్నాడు. అప్పుడే పాత ట్రాక్టర్‌కు సంబంధించిన పేపర్లు షోరూంలో అప్పజెప్పి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఆ షోరూం నుండి రుద్రూర్ మండలానికి చెందిన సాగర్ అనే వ్యక్తి ఆ పాత ట్రాక్టర్ కొనుగోలు చేసి బోధన్ మండలం హున్స గ్రామానికి చెందిన గంగ ప్రసాద్‌కి విక్రయించాడు. కానీ ఈ మొత్తం క్రమంలో పాత ట్రాక్టర్ మాత్రం బోడ రాంచందర్ పేరుపైనే కొనసాగుతూ వస్తోంది. ప్రసాద్ ట్రాక్టర్ కొన్న కొన్ని రోజులకు TS17 T2947 ఆటోతో ట్రాక్టర్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఉస్మాన్ అనే వ్యక్తి మరణించాడు. ఉస్మాన్ తన అత్త హున్స గ్రామానికి వచ్చినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది.
హున్స గ్రామస్థులు పంచాయతీ పెట్టారు. పంచాయతీలో పెద్ద మనుషుల ఎదుటకు వచ్చిన సాగర్.. ట్రాక్టర్ యజమాని బోడ రాంచందర్ మరణించాడని.. అందుకే ఉస్మాన్ కుటుంబ సభ్యులకు తానే ఏమైనా డబ్బులు ఇస్తా అని పంచాయితీలో అంగీకరించాడు. ఉస్మాన్ కుటుంబసభ్యులకు నష్టపరిహారం కింద ప్రసాద్ కొంత డబ్బు అందివ్వాలని గ్రామస్థులు కూడా తీర్మానం చేశారు. ఈ క్రమంలో ప్రసాద్, సాగర్ ఇద్దరూ కలిసి బోడ రాంచందర్ మరణించినట్లు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి సాయిలు అనే మరో వ్యక్తి పేరుపై ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో బోడ రాంచందర్ పేరుపై కేసు నమోదు అయింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బోడ రాంచందర్‌ను కలిశారు. దీంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని బోడ రాంచందర్.. హున్స గ్రామానికి ప్రసాద్ దగ్గరకు వెళ్ళాడు ఈ క్రమంలో ట్రాక్టర్ ఓనర్ చనిపోయాడని పంచాయతి చేశారని గ్రామస్థులు బోడ రాంచందర్‌ను ఆశ్చర్యంగా చూస్తూ అసలు విషయం చెప్పారు. నువ్వు చనిపోయావు అని సాగర్ తమకు చెప్పాడు అంటూ గ్రామస్తులు బోడ రాంచందర్‌కి తెలిపారు.
ఇది కూడా చదవండి : Dog Bites 2 Months Old Infant: చిన్నారుల తల్లిదండ్రులూ.. జర జాగ్రత్త
గ్రామస్తులు చెప్పింది విని షాక్‌కు గురైన రాంచందర్.. గంగ ప్రసాద్, సాగర్‌పై బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా పంచాయతీలో ఒప్పుకున్న డబ్బులు ఉస్మాన్ కుటుంబ సభ్యులకు ప్రసాద్ ఇవ్వక పోవడంతో కర్ణాటక రాష్ట్రం ఆవ్రాద్ కోర్టులో ఉస్మాన్ కుటుంబసభ్యులు బోడ రాంచందర్‌పై దావా వేశారు. తాను చెయ్యని తప్పుకు కోర్టులకు తిరగాల్సి వస్తోందని బోడ రాంచందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను ట్రాక్టర్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు తన పాత ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పేరు మార్పించకపోవడం వల్లే ఇదంతా జరిగింది.
ఇది కూడా చదవండి : Woman Brutally Kills Husband: 55 ఏళ్లకు ఎఫైర్.. భర్తను అతి కిరాతకంగా మంచానికి కట్టేసి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి