Student Murder Case in Eluru: ఏలూరు జిల్లాలో సంచలనం రేకెత్తించిన గిరిజన విద్యార్థి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీనియర్ విద్యార్థులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పాత గొడవల నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. వారిని జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు చెప్పారు. పూర్తి వివరాలు ఇలా..
బుట్టాయగూడెం మండలంలోని ఉర్రింక గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధన్ రెడ్డి (9).. పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. ఈ నెల 10వ తేదీన రాత్రి అఖిల్ నిద్రపోతుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. విద్యార్థి మెడ నులిమి, పీక నొక్కి.. కళ్లపై గుద్ది చంపినట్లు పోలీసులు గుర్తించారు. అతడి చేతిలో ఓ లేఖ కూడా ఉంచారు. 'బతకాలని ఉండే వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.. లేకపోతే ఇలాంటివి ఇంకా జరుగుతాయి.. ఇట్లు మీ ×××..' అని లేఖలో రాశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బుట్టాయగూడెం పోలీసులు.. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థిని పాత గొడవల నేపథ్యంలో సీనియర్ విద్యార్థులు హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన జువైనల్ హోమ్‌కు తరలించారు. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న నాల్గో తరగతి విద్యార్థిని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.
మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. గిరిజన వసతి గృహాంలోని వాచ్‌మెన్ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. వసతి గృహంలో చాలా రోజులుగా గొడవలు జరుగుతన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హెడ్‌మాస్టర్ దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నరు. విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవలు హత్యలకు దారి తీయడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Cyberabad Police: మరణించిన ఎస్సైకి పోస్టింగ్.. పోలీసులు వింత ఉత్తర్వులు
Also Read: Eluru News: కన్నతల్లి కసాయి బుద్ది.. సొంత కుమార్తెలను రెండో భర్తకు అప్పగించిన మహిళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి