Eluru: ప్రేమిస్తున్నానంటూ.. యువతిపై వేడి నూనే పోసి టార్చర్‌

ప్రేమ పేరుతో చాలా మంది యువకులు యువతులను వేధిస్తుంటారు. ఇలానే ఏలూరులో ఒక యువకుడు ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిని టార్చర్ చేయటం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా..   

Last Updated : Apr 23, 2023, 02:50 PM IST
Eluru: ప్రేమిస్తున్నానంటూ.. యువతిపై వేడి నూనే పోసి టార్చర్‌

Eluru: ఒకప్పుడు ప్రేమిస్తే ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధం అయ్యేవారు. ఇప్పటికి కూడా ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే వారు ఉన్నారేమో కానీ ఎక్కువ శాతం మంది ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తి నే చంపేందుకు సిద్ధం అవుతున్నారు. మారుతున్న కాలం మరియు సోషల్‌ మీడియా ప్రభావమో కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన నేరాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రేమించా అంటూ నమ్మించి దారుణంగా ప్రవర్తిస్తున్న యువకులు భారీగా పెరుగుతున్నారు. ఇటీవల ఏలూరు లో జరిగిన సంఘటన అమ్మాయిలు అందరికీ కూడా హెచ్చరిక వంటిది. ప్రేమ పేరుతో మోసం చేసే వారు ఆ తర్వాత చంపేసేందుకు కూడా సిద్ధం అవుతారని తాజా సంఘటనతో వెల్లడి అయ్యింది. 

ఏలూరు పోలీసులు మరియు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... స్థానిక శనివారపు పేటకు చెందిన యువతి జేఎన్‌టీయూ లో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. గత కొంత కాలంగా అదే ప్రాంతానికి చెందిన సదర్ల అనుదీప్‌ ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటాను అంటూ మాయ మాటలు చెప్పాడు. అతడి మాటలను యువతి నమ్మింది. సంవత్సర కాలంగా అనుదీప్ మరియు యువతి స్నేహం కొనసాగుతుంది.

అనుదీప్ మాయ మాటలు చెప్పి ఇటీవల తన ఇంటికి తీసుకు వెళ్లాడు. యువతిని బంధించి రాత్రి సమయంలో చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు. అత్యంత పాశవికంగా ఆమెను వేధించడం మొదలు పెట్టాడట. కాలుతున్న వేడి నూనెను కాలు మరియు చేతుల మీద పోయడంతో పాటు కొట్టి చిత్ర హింసలు పెట్టాడట. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరించడంతో యువతి భయపడి పోయిందట.

శనివారం రాత్రి సమయంలో ఉరి వేసి చంపేసేందుకు అనుదీప్‌  ప్రయత్నిస్తున్న సమయంలో యువతి అక్కడ నుండి పారిపోయి తన ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రుల సహాయంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. అనుదీప్ పై యువతి తల్లిదండ్రులు కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. ప్రస్తుతం యువతిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది... ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంది, డిశ్చార్జ్‌ చేస్తామని వైధ్యులు పేర్కొన్నారు. 

Also Read: Chalaki Chanti Background: చలాకీ చంటి రియల్ నేం, బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఇక పోలీసులు నిందితుడు అనుదీప్‌ కోసం గాలిస్తున్నారు. అతని బంధువులు మరియు మిత్రులను అనుదీప్ కోసం ప్రశ్నిస్తున్నారు. గతంలో అనుదీప్ పై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని.. గంజాయి అలవాటు ఉండటంతో పాటు మత్తు పదార్థాలకు బానిస అవ్వడం వల్ల అనుదీప్ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడు అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యం అయినంత త్వరగా అనుదీప్ ను పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Also Read: Bandi Sanjay Comments: సీఎం కాలేననే బాధతోనే రేవంత్ కన్నీళ్లు.. ఈటల ఆ మాట అనలేదు: బండి సంజయ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News