Dog Bites 2 Months Old Infant: చిన్నారుల తల్లిదండ్రులూ.. జర జాగ్రత్త

Dog Bites 2 Months Old Infant Baby: చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, తమ చుట్టూ ఉన్న పరిసరాల పట్ల ఎంత శ్రద్ధ వహించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చాటి చెప్పే ఘటన ఇది. చిన్నారుల తల్లిదండ్రులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా చాటిచెప్పిన ఘటన ఇది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 31, 2023, 12:14 PM IST
Dog Bites 2 Months Old Infant: చిన్నారుల తల్లిదండ్రులూ.. జర జాగ్రత్త

Dog Bites 2 Months Old Infant Baby: చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, తమ చుట్టూ ఉన్న పరిసరాల పట్ల ఎంత శ్రద్ధ వహించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చాటి చెప్పే ఘటన ఇది. చిన్నారుల తల్లిదండ్రులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా చాటిచెప్పిన ఘటన ఇది.

ఓ పిచ్చి కుక్క ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించింది. ఇంట్లో ఉన్న రెండు నెలల చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుంటి తండాలో చోటుచేసుకుంది. గాయపడిన 2 నెలల చిన్నారిని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుంటి తాండాకు చెందిన సురేష్, జ్యోతిల దంపతులు వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారు తమ రెండు నెలల కుమారుడితో పెంకుటి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోకి పిచ్చికుక్క చొరబడి బీభత్సం సృష్టించింది. 

ఇంట్లోకి చొరబడిన పిచ్చి కుక్క ఆ ఇంట్లో స్వైర విహారం చేసింది. 2 నెలల చిన్నారి ముఖంపై పిచ్చికుక్క కరిచింది. కుక్క దాడిలో తీవ్రంగా తీవ్ర గాయాలై రక్తమోడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు హుటాహటిన కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

ఇది కూడా చదవండి : Fake Death Certificates: అసలు వ్యక్తికే తెలియకుండా ఫేక్ డెత్ సర్టిఫికెట్

చిన్నారి ముఖంపై పిచ్చికుక్క దాడి చేసి విచక్షణారహితంగా కరవడంతో కుక్క కాట్లకు చికిత్స చేేసే క్రమంలో ఆ చిన్నారికి వైద్యులు 50కి పైగా కుట్లు వేశారు. ఇంకా 21 రోజులు ఆస్పత్రిలో ఉండాలని సుమారు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. తాము అంతా భరించలేమని బోరుమంటున్న ఆ తల్లిదండ్రులు.. ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని, దాతలను వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : School Headmaster Slept Naked: క్లాస్‌రూమ్‌లో నగ్నంగా హెడ్‌మాస్టర్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x