Crorepati Thief In 1,200 Burglaries: అతడొక కోటీశ్వరుడు.. చోరీలు చేసి కోట్లకు పడగలెత్తాడు. 17 ఏళ్లప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లోని నొయిడాను ఆనుకుని ఉన్న ఘాజియాబాద్‌లో గోవుల చోరీతో దొంగతనం మొదలుపెట్టాడు. అది మొదలు గత 25 ఏళ్లుగా చోరీలు చేయడాన్నే తన ఫుల్ టైమ్ జాబ్‌గా పెట్టుకున్నాడు. కార్పొరేట్ జాబ్ చేస్తున్నట్టుగా ఫార్మల్ డ్రెస్సులతో గెటప్ వేసుకుని ఖరీదైన సెడాన్ కార్లలో మరీ చోరీలకు వెళ్లడం అతడి చోరీల స్పెషాలిటీ. ఎక్కువగా సెక్యురిటీ లేని అపార్ట్‌మెంట్స్, ఒంటరిగా ఉండే భవనాలు ఎంచుకుంటాడు.
లిఫ్టులో నేరుగా పై అంతస్తుకు వెళ్తాడు. పై అంతస్తు నుంచి ఒక్కో అంతస్తు కిందకి దిగుతూ వస్తూ ఏయే ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని చెక్ చేసుకుంటాడు. అలా రెక్కీ నిర్వహించి ఎక్కువ కాలం పాటు తాళం వేయని ఇళ్లని ఎంచుకుంటాడు. ఎందుకంటే దీర్ఘకాలం పాటు తాళం వేసి ఉన్న ఇళ్లలోనూ ఏమీ ఉండదు కనుక. అలా ముందుగా లక్ష్యాన్ని ఎంచుకుని మరీ చోరీలకు పాల్పడటం అతడి ప్రత్యేకత. కేవలం క్యాష్, గోల్డ్ తప్పించి ఇంకేమీ ముట్టుకోడు. యథావిధిగా తాను వచ్చిన సెడాన్ కారు వేసుకుని ఉడాయిస్తాడు. అలా ఒక్క రాష్ట్రం కాదు.. రెండు రాష్ట్రాలు కాదు.. ఏకంగా 14 రాష్ట్రాల్లో మొత్తం 1200 చోరీ కేసుల్లో నిందితుడిగా పోలీసు రికార్డులకెక్కాడు. అతడి పేరే నదీమ్ ఖురేషి.
5వ తరగతి వరకే చదువుకుని చదువు ఆపేసిన నదీం ఖురేషీ.. చేసిన చోరీ సొత్తుతో కోట్లకు పడగలెత్తాడు. నదీం ఖురేషీ స్వస్థలం ఘాజియాబాద్.. కానీ ముంబై, పూణెలలో అతడికి కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అతడి పిల్లలు పేరున్న ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుకుంటున్నారు. 25 ఏళ్లుగా 14 రాష్ట్రాల పోలీసుల క్రైమ్ రికార్డ్స్ లో మోస్ట్ వాంటెడ్ థీఫ్. 14 రాష్ట్రాల పోలీసులు అతడి కోసం వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో సౌరబ్ ఆవాసాన్‌లో జరిగిన 12 లక్షల చోరీలోనూ నదీం నిందితుడు. ఈ కేసులోనే పోలీసులు అతడి కోసం వేటాడుతున్నారు. ఈ క్రమంలోనే సాల్ట్ లేక్ పోలీసులకు నదీం ఖురేషీ తీహార్ జైల్లో ఉన్నట్టు తెలిసింది. రాజస్థాన్‌లో జరిగిన చోరీ కేసులో అరెస్ట్ అయిన అతడిని తీహార్ జైల్లో పెట్టారు. ఆ విషయం తెలుసుకున్న సాల్ట్ లేక్ పోలీసులు తీహార్ జైలుకి వెళ్లి అతడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు.
ఇది కూడా చదవండి : Nellore Woman Killed Occultist: భర్తను వశీకరణం చేసుకునేందుకు మంత్రగాడిని పిలిచి.. మర్డర్ చేసింది
నదీం ఖురేషి తీహార్ జైలు చేజారితే మళ్లీ దొరకడం కష్టం అని భావించిన తీహార్ జైలు అధికారులు.. సాల్ట్ లేక్ పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించి పంపించారు. కానీ సాల్ట్ లేక్ పోలీసులు పట్టు విడవకుండా వెంటపడి తీహార్ జైలు అధికారుల ముందు ప్రొడక్షన్ రిమాండ్ పిటిషన్ పెట్టారు. దీంతో జైలు అధికారులు అతడిని పశ్చిమ బెంగాల్ పోలీసులకు అప్పగించారు. ఈ విధంగా నదీం ఎక్కడున్నాడో తెలుసుకున్న పోలీసులు అతడిని తమ కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. 45 ఏళ్ల నదీం ఖురేషి 25 ఏళ్ల చోరీ కెరీర్లో 8 సార్లు మాత్రమే అరెస్ట్ అయ్యాడు. కానీ బెయిల్ పైనో లేదా తప్పించుకుని బయటికి రావడం ఆనవాయితీగా మారింది. పశ్చిమ బెంగాల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న ఘటనతో నదీం ఖురేషి మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. నదీం ఖురేష్ నదీం గ్యాంగ్ పేరుతో ఓ ముఠాను తయారు చేసి తన చోరీల స్టైల్లోనే వారికి కూడా చోరీలు చేయడంలో తర్ఫీదు ఇచ్చి దేశం మీద వదిలేస్తుండటం ఈ మొత్తం స్టోరీలో కొసమెరుపు.
ఇది కూడా చదవండి : Murder Case Accused Shot Dead: సినీఫక్కీలో బస్సును ఆపి, పోలీసుల ముందే మర్డర్ కేసు నిందితుడిపై కాల్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.