Constable Murder Case: భార్య చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్య.. ప్రాణం తీసిన అక్రమ సంబంధం

Constable Ramesh Murder Case: విశాఖపట్టణం: ప్రియుడి మోజులో పడిన ఓ యువతి పోలీసు కానిస్టేబుల్ అయిన తన భర్తనే దారుణంగా హతమార్చింది. ప్రియుడితో సరసాలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యుండి కూడా అతి కిరాతకంగా వ్యవహరించింది.

Written by - Pavan | Last Updated : Aug 4, 2023, 08:59 AM IST
Constable Murder Case: భార్య చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్య.. ప్రాణం తీసిన అక్రమ సంబంధం

Constable Ramesh Murder Case: విశాఖపట్టణం: ప్రియుడి మోజులో పడిన ఓ యువతి పోలీసు కానిస్టేబుల్ అయిన తన భర్తనే దారుణంగా హతమార్చింది. ప్రియుడితో సరసాలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యుండి కూడా అతి కిరాతకంగా వ్యవహరించింది. భార్య కామవాంఛలకు పాపం ఆమె భర్త ఆమె చేతిలోనే బలయ్యాడు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్టణం ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న రమేష్ ని అతడి భార్యే హత్య చేసింది. కానీ తెలివిగా తన భర్తది హత్య కాదు.. గుండెపోటుతో సంభవించిన సహజ మరణం అనే డ్రామా ఆడింది. కానీ పోలీసును చంపిన కేసులో అంతిమంగా పోలీసుల చేతికే దొరికిపోయింది.

కానిస్టేబుల్ రమేష్ భార్య శివ జ్యోతి అలియాస్ శివానికి స్థానిక టాక్సీ డ్రైవర్ తో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివాహేతర సంబంధం నేపథ్యంలోనే తమకు అడ్డుగా ఉన్న భర్త కానిస్టేబుల్ రమేష్ ను అడ్డు తొలించుకునేందుకు పక్కా స్కేచ్ వేసిన భార్య శివ జ్యోతి.. అందుకు తన ప్రియుడు, అతడి స్నేహితుడి సహాయాన్ని తీసుకుంది. ఇంట్లోనే పథకం ప్రకారం రమేష్ పడుకున్న సమయంలో అతడిని బంధించి, దిండుతో అతడికి ఊపిరాడకుండా చేసిన శివ జ్యోతి.. ఆ తరువాత గుండెనొప్పిగా చిత్రీకరించింది. 

అనుకున్న పథకం ప్రకారమే ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి భర్త రమేష్‌ని హతమార్చిన శివాని.. అతడు గుండెనొప్పితో చనిపోయినట్టుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అంతటితో ఆగని శివాని.. ఆలస్యం చేస్తే తన అసలు నేరం బయటపడుతుంది అనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. 

ఇది కూడా చదవండి : Black Magic in Peddapalli: పెద్దపెల్లి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం

రమేష్ మృతి అనుమానాస్పద మృతిగా అనిపించడంతో తమ తోటి సహచర ఉద్యోగి, కానిస్టేబుల్ రమేష్ మరణం పట్ల ఆవేదనకు గురైన పోలీసులు అప్పుడే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రమేష్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఎంవీపీ పోలీసులు విచారణ చేపట్టారు. ఎంవీపీ పోలీసుల విచారణలో రమేష్ భార్య శివజ్యోతికి టాక్సీ డ్రైవర్‌తో అక్రమ సంబంధం ఉన్నట్టు వెలుగు చూసింది. మరింత లోతుగా విచారణ జరపగా.. ట్యాక్సీ డ్రైవర్‌తో వివాహితర సంబంధమే రమేష్ హత్యకు కారణంగా తెలిసింది. 2009 లో కానిస్టేబుల్‌గా విధుల్లోకి వచ్చిన బర్రి రమేష్.. విదుల్లో ఎంతో చురుకుగా ఉండేవాడని.. ఇలా భార్య చేతిలోనే హత్యకు గురవుతాడని అనుకోలేదని తోటి సిబ్బంది, సహచర మిత్రులు ఆవేదన వ్యక్తంచేశారు.

ఇది కూడా చదవండి : Volunteer Arrested: సంక్షేమ పథకాల కోసం ఫోర్జరీ.. వాలంటీర్ అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News