Student Attacks with knife on another Student: స్కూల్స్ లో గన్ ఫైరింగ్.. కత్తి పోట్లు అనేవి ఎక్కువగా అమెరికాలో చూస్తూ ఉంటాం. అమెరికా స్కూల్ లో గన్ కాల్పులు... ఇంత మంది మృతి అంటూ ఇన్నాళ్లు వార్తలు చూసి భయపడ్డాం. కానీ ఇప్పుడు ఆ సంఘటనలు మన చుట్టు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల 9వ తరగతి పిల్లల మధ్య ఏర్పడిన గొడవ చివరకు కత్తితో పొడుచుకునే వరకు వెళ్లింది. స్థానికులతో పాటు ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం హైస్కూల్ లో ఈ సంఘటన జరిగింది. పరీక్ష రాస్తున్న విద్యార్థిపై అదే క్లాస్ కు చెందిన విద్యార్థి చాకు తో పొడిచాడు. చుట్టూ విద్యార్థులు ఉన్నారు.. ఉపాధ్యాయులు కూడా చూస్తున్నారు అనే విషయం కూడా పట్టించుకోకుండా ఆ పిల్లాడు తన తోటి విద్యార్థి పై కత్తితో దాడి చేయడం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం కత్తి పోటుకు గురి అయిన విద్యార్థి రాజమహేంద్ర వరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తోటి విద్యార్థి పై దాడి చేసిన విద్యార్థి ప్రస్తుతం పరారీ లో ఉన్నాడు. స్కూల్ యాజమాన్యం నుండి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కత్తితో పొడిచిన విద్యార్థిని పట్టుకునేందుకు రెండు టీమ్స్ గా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. బంధువులు మరియు మిత్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించి ఆ పిల్లాడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Dead Body in Cooler: మధ్యప్రదేశ్ లో దారుణం.. కూలర్ లో 5 ఏళ్ల పిల్లాడి శవం
ఇద్దరి మధ్య గొడవ ఏంటీ అనే విషయంలో క్లారిటీ లేదు. తోటి విద్యార్థులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది కత్తి పోటుతో ఆసుపత్రిలో ఉన్న విద్యార్థి చెప్పాలి.. లేదంటే కత్తితో పొడిచి పారిపోయిన విద్యార్థి అయిన చెప్పాల్సి ఉంది.
విద్యార్థుల మధ్య చిన్న చిన్న ఘర్షణలకు ఇలాంటి చర్యలకు సిద్ధం అవ్వడంను మానసిక సమస్యగా వైధ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పెరిగిన విధానం.. వారు చూస్తున్న సినిమాల ప్రభావం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Jagapathi Babu : పుష్ప ది రూల్‌లో జగ్గూ భాయ్.. నెక్ట్స్ ఏం జరుగుతుందో తెలియదంట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
East Godavarikhani: గోదావరి జిల్లాలో దారుణం.. 9వ తరగతి క్లాస్ పిల్లల గొడవ.. కత్తితో దాడి