Accident In Nashik Shirdi Highway: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై నుంచి షిరిడీకి వెళుతున్న టూరిస్ట్ బస్సు నాసిక్-షిర్డీ హైవేపై ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ సమీపంలోని సాయిబాబా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ముంబైలోని అంబర్నాథ్ నుంచి షిర్డీ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికులతో బస్సు ప్రయాణిస్తుండగా.. సిన్నార్-షిర్డీ హైవేపై పడే పథేర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
బస్సులో దాదాపు 45 నుంచి 50 మంది వరకు ఉన్నట్లు సమాచారం. వీరంతా ముంబైలోని అంబర్నాథ్ నివాసితులు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మృతులను ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు మాట్లాడుతూ.. ముంబైకి 180 కిలోమీటర్ల దూరంలోని నాసిక్‌లోని సిన్నార్ తహసీల్‌లోని పఠారే శివర్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
మరోవైపు నాసిక్-షిర్డీ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వ్యక్తులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
Also Read: Pawan Kalyan: ఆ రోజు సినిమాలు వదిలేస్తా.. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి