Union Budget 2024: బడ్జెట్ అనగానే సామాన్యుల నుంచి ధనికుల వరకూ ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశిస్తుంటారు. ముఖ్యంగా వేతన జీవులు ప్రభుత్వం నుంచి చాల వరకూ మినహాయింపులుంటాయని భావిస్తుంటారు. ట్యాక్స్ పేయర్లు ప్రస్తుతం రానున్న బడ్జెట్లో చాలా అంచనాలు పెట్టుకున్నారు.
2024 సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. దాంతో చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ట్యాక్స్ పేయర్లకు ఈసారి బడ్జెట్లో తప్పకుండా ప్రయోజనం ఉండేలా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో సాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచవచ్చని భావిస్తున్నారు. 2018లో స్టాండర్డ్ డిడక్షన్ 40 వేలుగా నిర్ణయించారు. అంతకుముందు అది ట్రావెల్ అలవెన్స్ 19,200 రూపాయలు, మెడికల్ అలవెన్స్ 15 వేలుగా ఉండేది. ఆ తరువాత 2019లో స్టాండర్డ్ డిడక్షన్‌ను 50 వేలు చేసింది ప్రభుత్వం. అప్పట్నింటి అదే కొనసాగుతోంది.
స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా విన్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న 50 వేలతో ట్యాక్స్ పేయర్లకు ఓ మాదిరి ప్రయోజనాలు అందుతున్నాయి. రానున్న బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్‌ను 1 లక్ష రూపాయలకు పెంచవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటి
స్టాండర్డ్ డిడక్షన్ అంటే వేతన జీవులకు లభించే మినహాయింపు, దీనికింద ఉద్యోగులు ఎలాంటి ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరం లేదు. మీ ఆదాయంలో ఏడాదికి 50 వేల రూపాయలను ట్యాక్స్ లెక్కించేటప్పుడు మినహాయించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ ఈ మినహాయింపు అందుబాటులో ఉంది. 2022-23 వరకూ కేవలం పాత ట్యాక్స్ సిస్టమ్‌లో మాత్రమే ఇది వర్తించేది. కానీ 2023-24 నుంచి న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ఉన్నవారికి కూడ 50 వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తోంది. ఇప్పుడీ స్టాండర్డ్ డిడక్షన్‌ను లక్ష రూపాయలకు పెంచవచ్చని తెలుస్తోంది.
Also read: Freedom 125 Bike: భారత్‌లో మొట్ట మొదటి CNG బైక్ లాంచ్.. ఫీచర్స్ అన్ని అదుర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook