Aadhaar Update: ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్‌డేట్ అయిందా, ఎలా చెక్ చేసుకోవాలి

Aadhaar Update: దేశంలో ప్రతి ఒక్కరికీ, ప్రతి ఒక్క పనికీ ఆధార్ కార్డు ఆధారంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2024, 04:37 PM IST
Aadhaar Update: ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్‌డేట్ అయిందా, ఎలా చెక్ చేసుకోవాలి

Aadhaar Update: ఆధార్ కార్డులో ఎప్పుడూ పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలు, ఫోన్ నెంబర్, చిరునామా అనేది అప్‌డేట్ చేస్తుండాలి. ఫోన్ నెంబర్ మారినప్పుడు తప్పకుండా ఆధార్ కార్డులో మార్చుకోవాలి. ఎందుకంటే చాలా పథకాలు, పనులకు మొబైల్ నెంబర్ లింక్డ్ ఆధార్ అనేది చాలా అవసరం. అదే విధంగా అప్‌డేట్ చేసిన బయోమెట్రిక్ ఇతర వివరాల స్టేటస్ కూడా చాలా సులభంగా ఆన్‌లైన్ విధానంలో తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డుకు సంబంధించి పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను అప్‌డేట్ చేయాలంటే తగిన ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ మార్చేందుకు ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు. ఈ వివరాలను ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో పూర్తి చేయవచ్చు. కానీ బయోమెట్రిక్ వివరాలు మాత్రం ఆధార్ ఎన్‌రోల్ సెంటర్‌లోనే అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. బయోమెట్రిక్ వివరాలు మార్చిన తరువాత లేదా అప్‌డేట్ చేశాక దానికి సంబంధించిన స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఆధార్ బయోమెట్రిక్ వివరాల అప్‌ట్ స్టేటస్ చెక్ చేసేందుకు యూఐడీఏఐ టోల్ ఫ్రీ నెంబర్ 1947కు ఫోన్ చేయవచ్చు. లేదా సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి కూడా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ఆధార్ కార్డు నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అందించాల్సి ఉంటుంది. ఆధార్ మొబైల్ యాప్ ఆధారంగా కూడా స్టేటస్ చెక్ చేయవచ్చు. ముందుగా మీ మొబైల్‌లో ఆధార్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, ఓటీటీ ఎంటర్ చేయాలి. ఆ తరువాత అప్‌డేట్ రిక్వస్ట్ స్టేటస్ క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై అందుకు సంబంధించిన వివరాలు కన్పిస్తాయి. 

ఎస్ఎంఎస్ ద్వారా కూడా బయోమెట్రిక్ వివరాల స్టేటస్ చూసుకోవచ్చు. లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్  https://uidai.gov.in/en/. ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసం సైట్ ఓపెన్ అయ్యాక ట్రాక్ ఆధార్ అప్‌డేట్ స్టేటస్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఓటీపీతో వెరిఫై చేశాక సబ్మిట్ క్లిక్ చేస్తే మీ వివరాల స్టేటస్ కన్పిస్తుంది.

Also read: Maruti Suzuki Baleno Lowest Price: 2 లక్షల తగ్గింపు.. Baleno కారును కేవలం రూ.6 లక్షల లోపే పొందడి, పూర్తి వివరాల కోసం..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News