Blue Aadhaar Card: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఈ 12 అంకెల ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ వివరాలు సైతం నిక్షిప్తమై ఉంటాయి. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ పని ఏది కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. ఆధార్ కార్డు అనేది ఓ ఐడీలా కూడా పనిచేస్తుంది.
బ్యాంకు ఎక్కౌంట్ లేదా డీమ్యాట్ ఎక్కౌంట్ తెరిచేందుకు, సిమ్ కార్డు కోసం అప్లై చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్దికి ఇలా దేనికైనా సరే ఆధార్ కార్డు కావల్సిందే. స్టాక్ మార్కెట్ కొనుగోళ్లు, మ్యుచ్యువల్ ఫండ్స్ కోసం కూడా ఆధార్ కార్డు అవసరం. వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ది పొందేందుకు ఆధార్ కార్డు అవసరమౌతోంది. తద్వారా నేరుగా వ్యక్తి బ్యాంక్ ఎక్కౌంట్‌లో నగదు జమ అవుతుంటుంది. అంత ముఖ్యమైన ఆధార్ కార్డులో చాలా రకాలున్నాయనే సంగతి చాలామందికి తెలియదు. అందులో ఒకటి బ్లూ ఆధార్ కార్డు. అసలీ బ్లూ ఆధార్ కార్డు అంటే ఏమిటి, దీని ఉపయోగాలేంటనేది పరిశీలిద్దాం.
బ్లూ ఆధార్ కార్డు అనేది చిన్న పిల్లలకు ఉద్దేశించిందగి. దేశంలోని ఐదేళ్లలోపు పిల్లలకు యూఐడీఏఐ బ్లూ ఆధార్ కార్డు జారీ చేస్తుంది. బ్లూ ఆధార్ కార్డుకు మరో పేరు బాల్ ఆధార్ కార్డు. దీనికి బయోమెట్రిక్ అవసరం లేదు. మొన్నటి వరకు పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు బర్త్ సర్టిఫికేట్ అవసరమయ్యేది. కానీ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ లేకుండానే బ్లూ ఆధార్ కార్డు పొందవచ్చు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో కూడా బ్లూ ఆధార్ కార్డు అప్లై చేయవచ్చు. బ్లూ ఆధార్ కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఐదేళ్ల వరకే ఇది పనిచేస్తుంది. ఐదేళ్ల తరువాత బ్లూ ఆధార్ కార్డు రెన్యువల్ చేయించుకోవాలి.
Also read: Blood Pressure Signs: ఉదయం వేళ ఈ 5 లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, హై బీపీ కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.