Aadhaar Link: మీ మెయిల్ ఐడీతో ఆధార్ లింక్ చేశారా, లేకపోతే అన్నీ ఆగిపోతాయి

Aadhaar Link: ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. యూఐడీఏఐ ఈ విషయమై అలర్ట్ జారీ చేసింది. ఆ పని పూర్తి చేయకపోతే..అన్ని పనులు నిలిచిపోక తప్పదు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2022, 04:08 PM IST
Aadhaar Link: మీ మెయిల్ ఐడీతో ఆధార్ లింక్ చేశారా, లేకపోతే అన్నీ ఆగిపోతాయి

నిత్య జీవితంలో అన్నింటికీ ఆధారమైన ఆధార్ కార్డు విషయమై ఇప్పుడు మరో అప్‌డేట్ అలర్ట్ జారీ అయింది. సకాలంలో అది అప్‌డేట్ చేస్తే ప్రయోజనాలున్నాయి. లేకపోతే మీ పనులన్నీ నిలిచిపోనున్నాయి. ఆ అప్‌డేట్ గురించి తెలుసుకుందాం..

ఆధార్ కార్డు ఇటీవలి కాలంలో ప్రతి పనికీ అవసరమౌతుంది. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, సెక్స్, పేరు, ఇంటి పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ వంటివి అప్‌డేట్ చేయరు. ఫలితంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందాల్సినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కేవలం ప్రభుత్వపరంగానే కాకుండా..ప్రైవేటురంగంలో కూడా ఆధార్ అవసరమౌతోంది. మరోవైపు సైబర్  నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో యూఐడీఏఐ ట్వీట్ ద్వారా కీలకమైన అప్‌డేట్ గురించి వివరించింది. 

యూఐడీఏఐ అక్టోబర్ 17న ఈ ట్వీట్ చేసింది. మీ ఆధార్ కార్డును ఇకపై మీ మెయిల్ ఐడీతో లింక్ చేయాలి. దీనివల్ల మీ ఆధార్ కార్డ్ ఎక్కడైనా వినియోగిస్తే..అదే సమయంలో మెయిల్‌కు అలర్ట్ వస్తుంది. అంటే ఎవరైనా మీ ఆధార్ కార్డును తప్పుడు విధానంలో వినియోగిస్తే వెంటనే మెయిల్ ఐడీకు మెస్సేజ్ వచ్చేస్తుంది. అంటే ఎవరైనా ఫ్రాడ్ చేస్తుంటే మీకు తెలిసిపోతుంది. 

ఆధార్ కార్డుకు మెయిల్ ఐడీ ఎలా లింక్ చేయాలి

మీ ఆధార్ కార్డుకు మెయిల్ ఐడీ లింక్ చేయాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లండి. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో చేయలేరు. సమీపంలోని ఆధార్ కేంద్రంలో మాత్రమే మెయిల్ ఐడీని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. 

Also read: Dhanteras Gold: దంతేరస్ రోజు 2 నిమిషాల్లో డిజిటల్ గోల్డ్ కొనే సులభమైన మార్గాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News