UIDAI Updates: ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీలను ఇకపై స్వయంగా వెరిఫై చేసుకోవచ్చు

UIDAI Updates: ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ వెరిఫికేషన్‌కు అనుమతిచ్చే ఫీచర్ ఇది. అంటే సదరు ఆధార్ కార్డు గ్రహీత ఆమోదం లేకుండా సీడింగ్ అనేది జరగదు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 25, 2023, 12:06 PM IST
UIDAI Updates: ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీలను ఇకపై స్వయంగా వెరిఫై చేసుకోవచ్చు

UIDAI Updates: ఆధార్ కార్డుతో అనుసంధానమైన తమ తమ ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలను వెరిఫై చేసుకునేందుకు యూఐడీఏఐ అనుమతిస్తోంది. ఆధార్ కార్డు సీడెడ్ నెంబర్లు, మెయిల్ ఐడీల విషయంలో ఏర్పడుతున్న సందిగ్దతను తొలగించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చాలామందికి ఒకటి కంటే ఎక్కువ ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆధార్ కార్డుకు ఏ నెంబర్ లింక్ చేశారో గుర్తు లేకపోవడం వల్ల ఓటీపీ జనరేట్ అయినప్పుడు ఏ నెంబర్‌కు వెళ్లిందో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటోంది. అందుకే ఈ అసౌకర్యాన్ని దూరం చేసేందుకు ఆధార్ కార్డు గ్రహీతలు తమ తమ ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలను చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.  యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/వెరిఫై ఈమెయిల్ లేదా వెరిఫై మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 

ఈ ఫీచర్ ప్రకారం ఆధార్ నెంబర్ కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఏ మొబైల్ నెంబర్ అనుసంధానం కాకపోయుంటే వెంటనే లింకింగ్ ప్రక్రియ చేపట్టవచ్చు. ఏ నెంబర్ లింకింగ్‌కు ఇచ్చారో గుర్తు లేనప్పుడు చివరి మూడు నెంబర్ల ఆధారంగా గుర్తు పట్టవచ్చు. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ అనుసంధానించేందుకు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

Also read: Stocks To Buy Today For High Returns: కేవలం 5 నుండి 15 రోజుల్లో భారీ లాభాలు ఇచ్చే స్టాక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News