Uber Hiring: ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఊబెర్ పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనుంది. బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల్లో ఇంజనీర్లను నియమించనుంది.
ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఊబెర్..ఇండియా టెక్ కేంద్రాల్లో పనిచేసేందుకు 5 వందల మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. 2021లో హైదరాబాద్, బెంగళూరులోని టెక్ సెంటర్లలో ఇప్పటికే 250 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంది. ఇప్పుడా సంఖ్యను రెట్టింపు చేయనుంది. ఇందులో భాగంగా ఇంజనీర్లను, డేటా సైంటిస్టులను, ప్రోగ్రామ్ మేనేజర్లను, ప్రోగ్రామ్ మేనేజర్లను టెక్ సెంటర్లలో నియమించనుంది.
స్థానికంగా ఉత్పత్తుల్ని పెంచడం, ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడం కోసం ఊబెర్ కంపెనీ పెద్ద ఎత్తున ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని తీసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ టీమ్స్‌ను విస్తరించే క్రమంలో రిక్రూట్‌మెంట్ చేపట్టింది. అటు యూఎస్, కెనడా, లాటిన్ అమెరికా, ఆమ్‌స్టర్‌డామ్, ఇండియాల్లో కొత్తగా రిక్రూట్‌మెంట్ చేస్తోంది. కంపెనీ కొత్తగా బెంగళూరులో టెక్ సెంటర్ ఏర్పాటు చేసింది. అదే సమయంలో కర్నాటక ప్రభుత్వంతో ఊబెర్ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో కొన్ని నగరాలతో ఊబెర్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అదే విధంగా ఇండియాలో వివిధ ప్రభుత్వాలతో భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఊబెర్ ఆలోచిస్తోంది. ప్రభుత్వాలతో భాగస్వామ్యమైతే..ఏదో ఒక యూనివర్శిటీలో టెక్ సెంటర్లు నెలకొల్పుతుంది.
Also read: Motorola Edge 20 Offers: రూ.8,499 ధరకే Motorola Edge 20 కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.