Top 5 Automated Cars: అత్యంత తక్కువ ధరకు లభించే టాప్ 5 ఆటోమేటెడ్ కార్లు, ప్రత్యేకతలు

Top 5 Automated Cars: ఇప్పుడంతా ఆటోమేటెడ్ యుగం. స్మార్ట్‌ఫోన్ల నుంచి కార్ల వరకూ ఇంట్లో వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు ఆటోమెటెడ్ కావడం విశేషం. ఆధునిక సాంకేతికత ఇప్పుడు అన్నింటా అందుబాటులోకి వచ్చేస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం ఆటోమేటెడ్ కావడంతో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2023, 04:43 PM IST
Top 5 Automated Cars: అత్యంత తక్కువ ధరకు లభించే టాప్ 5 ఆటోమేటెడ్ కార్లు, ప్రత్యేకతలు

Top 5 Automated Cars: ఇండియాలో ఆటోమేటెడ్ కార్లు తక్కువ రకం కార్ల నుంచి ఖరీదైన కార్ల వరకూ అన్నింటా ఉంది. దేశంలో తొలిసారిగా ఎంట్రీ లెవెల్ కార్లలో ఆటోమేటెడ్ టెక్నాలజీ ప్రారంభించింది మారుతి సుజుకి కంపెనీ. మారుతి కంపెనీకు చెందిన సెలేరియోలో మొదటిసారి ఏఎంటీ టెక్నాలజీ వినియోగించారు. దేశంలో తక్కువ ధరకు అంటే ఆరు లక్షల్లోపు అందుబాటులో ఉన్న టాప్ 5 ఆటోమేటెడ్ కార్ల గురించి తెలుసుకుందాం..

మారుతి సుజుకి సెలేరియా. దేశంలో ఎంట్రీ లెవెల్ తక్కువ ఖరీదైన కార్లలో ఏఎంటీ అందుబాటులో వచ్చింది తొలిసారి ఈ కారుతోనే. ఈ కారు మైలేజ్ లీటరుకు 23.1 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ కారు ధర 4.97 లక్షల నుంచి 5.40 లక్షలుంటుంది. ఈ కారు ఇంజన్ 67 హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 

హ్యుండయ్ శాంత్రో. హ్యుండయ్ కంపెనీ పరిచయం చేసిన తొలి కారు ఇది. ఇందులోనే ఇప్పుడు లేటెస్ట్  టెక్నాలజీ ఏఎంటీతో వస్తోంది. ఇది 1.1 లీటర్ ఇంజన్ ఆధారంగా 68 హార్స్ పవర్, 99 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటుంది. లీటరుకు 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర 5.18 లక్షల నుంచి 5.46 లక్షల వరకూ ఉంటుంది. టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ మరో ప్రత్యేకత.

మారుతి సుజుకి ఎస్‌ప్రెసో. తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఏఎంటీ టెక్నాలజీ హ్యాచ్‌బ్యాక్ కారు ఇది. ఇందులో 1.0 లీటర్ 3 సిలెండర్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 67 హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక మ్యూజిక్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే..7 అంగుళాల స్మార్ట్ ప్లే ఇన్‌ఫోటైన్‌మెంట్ ఉంటుంది. 

రెనాల్ట్ క్విడ్. ఇతర ఊర్లకు వెళ్లే కంటే నగరంలోనే ఎక్కువగా తిరిగేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పరిమాణంలో చిన్న కారు ఇది. మారుతి ఆల్టో కే పరిమాణంలో ఉంటుంది. ఇందులోనే లేటెస్ట్ రెనాల్ట్ క్విడ్ ఏఎంటీ 1.0 లీటర్ ఇంజన్‌తో వస్తోంది. ఇది 67 బీహెచ్‌పి పవర్‌ను, 91 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎంబెడెడ్ నావిగేషన్, టచ్‌స్క్రీన్ ఇన్‌ఫో‌టైన్‌మెంట్ దీని ప్రత్యేకత.

టాటా టియాగో. దేశంలో ఏఎంటీ అందుబాటులో ఉన్న అత్యుత్తమ కారు ఇదే. ఇది 1.2 లీటర్ ఇంజన్‌తో 84 హార్స్ పవర్, 114 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. లీటరుకు 23.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో ఏఎంటీతో పాటు మేన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంది. ఈ కారు ధర 5.04 లక్షల నుంచి 5.63 లక్షల వరకూ ఉంది.

Also read: Low Cost Best Smartphone: 108 ఎంపీ కెమేరాతో స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వందలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News