Coins missing in SBI: డబ్బులు ఇంట్లో దాచుకుంటే ఎక్కడ దొంగలు పడతారోనని బయపడటం సాధారణంగా చూస్తుంటాం. అందుకే ఈ సమస్యకు ఉన్న అత్యుత్తమ పరిష్కారం డబ్బును బ్యాంకులో దాచుకోవడం. కానీ ఆ బ్యాంకులోనే చోరీ జరిగితే.. అలాటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ ఏమైందంటే..
ఓ ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఈ చోరీ జరగటం గమనార్హం. అయితే ఇక్కడ దొంగలు చోరీ చేసిన మొత్తం రూ.11 కోట్లు కాగా.. ఆ మొత్తం కాయిన్ల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ సంఘటన రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. ఈ చోరీని చేదించేందుకు ఏకంగా సీబీఐ రంగంలోకి దిగింది.
నోట్లు అయితే వాటిపై ఉండే సీరియల్ నంబర్స్ ద్వారా సులభంగా గుర్తించొచ్చు. కానీ నాణెలు కావడంతో వాటిని గుర్తించి పట్టుకోవడం ఇప్పుడు అత్యంత క్లిష్టమైన అంశంగా మారింది.
పూర్తి వివరాలు ఇలా..
రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో తాజాగా.. ఏకంగా రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమయ్యాయి. ఉన్నతాధికారులు తాజాగా లెక్కలు తీయగా... ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో షాక్‌కు గురైన అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. ఇక ఇదే విషయమై రాజస్థాన్ హై కోర్టును కూడా ఆశ్రయించారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఎస్‌బీఐ అభ్యర్థనను స్వీకరించిన న్యాయస్థానం.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
కోర్టు అదేశాల మేరకు పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను తీసుకుని.. సోమవారం రోజునే దర్యాప్తు మొదలు పెట్టారు సీబీఐ అధికారులు. ప్రస్తుతం అనుమానితులుగా ఉన్న వారిని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రథమిక దర్యాప్తులోనే పలు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. రూ.11 కోట్ల విలువైన నాణెలను.. ఆ దొంగలు రూ.13 కోట్లకు విక్రయించాలని ప్లాన్ వేసినట్లు తెలిసింది. అయితే వీలైనంత త్వరగా ఆ దొంగలను పట్టుకోవాలని సీబీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Also read: Redmi 10A Launch: రెడ్‌మి నుంచి మరో కొత్త ఫోన్, రేపే ఇండియాలో లాంచ్, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook