LPG Cylinder Insurance: మోడీ ప్రభుత్వం పౌరుల కోసం ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన తర్వాత, దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్ వినియోగం ప్రతి ఇంట్లోనూ వేగంగా పెరుగుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు పల్లెటూర్లు, కుగ్రామాలకు సైతం చేరాయి. అయితే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వాడే ప్రతీ ఒక్క కుటుంబం కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లపై ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులో ఉందన్న విషయాన్ని గుర్తించాలి. నిజానికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తారనే విషయం మనలో చాలా మందికి తెలియదు.దీని కోసం కస్టమర్ నుండి ఎలాంటి ప్రీమియం డబ్బులు వసూలు చేయరు.50 లక్షల వరకు ఈ బీమా కూడా పూర్తిగా ఉచితం.అయితే ఈ బీమా సౌకర్యాన్ని ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో పొందవచ్చో తెలుసుకుందాం.
LPG సిలిండర్‌లు పేలినప్పుడు, ఇతర ప్రమాదాలు జరిగిన సందర్భాలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి.అలాంటప్పుడు ప్రమాదం వల్ల కలిగే నష్టాన్ని ఈ బీమా ద్వారా కస్టమర్ కవర్ చేయవచ్చు.పెట్రోలియం కంపెనీల (ఇండియన్, భారత్, హెచ్‌పి)నుండి ఎల్‌పిజి కనెక్షన్ తీసుకునే కస్టమర్‌లు,వారి కుటుంబాలకు ఈ ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుంది .గ్యాస్ లీక్ లేదా పేలుడు వంటి ప్రమాదాలు జరిగితే, బాధితుడి కుటుంబానికి రూ.50 లక్షల వరకు బీమా సౌకర్యం లభిస్తుంది.
కుటుంబంలోని ప్రతి సభ్యునికి రూ. 50 లక్షల వరకు బీమా:
గ్యాస్ లీకేజీ లేదా పేలుడు వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు, మొత్తం కుటుంబానికి ఒక్కో సభ్యునికి రూ.10 లక్షలు అందుతాయి.వీటిలో,ఆస్తి నష్టం,వైద్య చికిత్స, మరణం విషయంలో వివిధ మొత్తాలు నిర్ణయించారు.సిలిండర్ పేలి మరణిస్తే గరిష్టంగా రూ.50 లక్షలు క్లెయిమ్ చేయవచ్చు.మొత్తం కుటుంబానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు బీమా వర్తిస్తుంది.అయితే,ఈ బీమా ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులను పాటించడం అవసరం.
ముఖ్యమైన షరతులు:
గ్యాస్ లీకేజీ లేదా పేలుడు వంటి ప్రమాదాల విషయంలో క్లెయిమ్ ప్రయోజనం ISI గుర్తుతో సిలిండర్ పైపు,స్టవ్,రెగ్యులేటర్ కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.క్లెయిమ్ కోసం, మీరు సిలిండర్, స్టవ్‌ని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి.ఈ బీమా క్లెయిమ్ కోసం వినియోగదారుడు తమ డీలర్, పోలీస్ స్టేషన్‌కు 30 రోజులలోపు అంటే ప్రమాదం జరిగిన నెలలోపు ప్రమాదాన్ని తెలియజేయాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు ప్రమాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీ,మెడికల్ రసీదు,హాస్పిటల్ బిల్లు,పోస్ట్‌మార్టం రిపోర్ట్,డెత్ సర్టిఫికేట్ వంటి పత్రాలు అవసరం. ముఖ్యంగా, ఈ బీమా పాలసీలో కస్టమర్ ఎవరినీ నామినేట్ చేయాల్సిన అవసరం లేదు అంతే కాదు, రిజిస్టర్డ్ నివాసంలో ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే వినియోగదారుడు బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు.
Also Read : HAL Stock:రూ.1లక్ష కోట్ల ఆర్డర్ బుక్ దిశగా HAL..ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా మారిన ప్రభుత్వ రంగ సంస్థ.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
LPG Cylinder Insurance: ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా..అయితే మీ కోసం ఉచితంగా 50 లక్షల బీమా..ఎలా క్లెయిం చేసుకోవాలంటే..?