Cheap and Best, Safest SUV Car: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వాహనదారులు, ప్రయాణికుల భద్రత కోసం, వారి సురక్షితమైన ప్రయాణం కోసం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అన్ని వాహనాలలో ఎయిర్ బ్యాగ్స్ వంటి భద్రతా ప్రమాణాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానం చేరుకోవడం కోసం పాటుపడుతున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుండటంతో భద్రతను అందించే సేఫ్టీ కార్లకు కూడా ఇండియాలో భారీగా డిమాండ్ పెరుగుతోంది.
కార్లు కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు తమ లైఫ్ సేఫ్టీ కోసం అవసరం అయితే ఇంకాస్త ఎక్కువ చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ కస్టమర్ల సేఫ్టీ కోసం బెస్ట్ స్టాండర్డ్స్ ఫీచర్స్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దేశంలోనే తక్కువ బడ్జెట్‌లో అత్యంత ఎక్కువ సేఫ్టీని అందించే సురక్షితమైన కారు గురించి తెలుసుకుందాం రండి. ఆ కారు మరేదో కాదు.. సేఫ్టీకి పెట్టింది పేరైన టాటా కంపెనీ తీసుకొచ్చిన టాటా పంచ్ కారు.
టాటా పంచ్.. పేరుకు తగినట్టే పంచ్‌లో ఉండే పవరే వేరు
సేఫ్టీ పరంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న టాటా పంచ్ కారును టాటా కంపెనీ అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. టాటా కంపెనీ తయారు చేసిన కార్లు అంటేనే.. కస్టమర్లకు ఒక గొప్ప నమ్మకం. కారు తయారీకి టాటా ఉపయోగించేంత స్ట్రాంగ్ మెటల్ మరే ఇతర కార్ల కంపెనీలు ఉపయోగించవు అనేది టాటా కంపెనీ కార్లపై కస్టమర్లకు ఉన్న విశ్వాసం. కస్టమర్ల నమ్మకానికి తగినట్టుగానే టాటా కంపెనీ టాటా పంచ్ కారును లాంచ్ చేసింది.
2021లో టాటా పంచ్ కారు లాంచ్ అయిన తర్వాత, కస్టమర్లు మారుతి వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ కార్ల వైపు మొగ్గు చూపడం కొంతమేరకు తగ్గినట్టే కనిపిస్తోంది. అన్నట్టు త్వరలోనే టాటా పంచ్ కారు CNG వెర్షన్ కూడా లాంచ్ అవబోతోంది. డ్యూయల్ సిలిండర్ సిఎన్‌జి టెక్నాలజీని పొందిన మొదటి కారుగా టాటా పంచ్ కి గుర్తింపు దక్కనుంది. 2023 ఏడాది చివరిలో ఈ కారు లాంచ్ అవనుంది.
దేశంలో అత్యంత సురక్షితమైన చీప్ అండ్ బెస్ట్ సేఫ్ కారు ఇదే..
మిగతా కార్ల కంపెనీలతో పోల్చుకుంటే టాటా మోటార్స్ లాంచ్ చేసిన సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి కారుగా టాటా పంచ్ అందరి మన్ననలు అందుకుంది. దేశంలోనే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న ఒకే ఒక్క కారు మోడల్ ఈ టాటా పంచ్. టాటా పంచ్ కారు ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. డ్రైవింగ్ సీటుతో కలిపి ఐదుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించే వెసులుబాటు ఈ కారు సొంతం. టాటా పంచ్ కారులో 366 లీటర్ల బూట్ స్పేస్ అందిస్తోంది. ఎలాంటి రోడ్లపైనైనా దూసుకుపోయేలా 187 మిమి గ్రౌండ్ క్లియరెన్స్‌తో కారును డిజైన్ చేశారు.
టాటా పంచ్ పవర్‌ఫుల్ ఇంజిన్
టాటా పంచ్ కారు బాడీ ఎంత బలమైనదో.. అలాగే ఆ కారు ఇంజిన్ కూడా అంతే శక్తివంతమైనది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన టాటా పంచ్ కారు 86 bhp పవర్, 113 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు మైలేజీ లీటరుకు 19 కి.మీ ఇస్తుంది.
టాటా పంచ్ ఫీచర్స్
టాటా పంచ్ కారు ఫీచర్ల విషయానికొస్తే.. ఇన్ఫోటెయిన్మెంట్ పరంగా 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటో ఎయిర్ కండిషనింగ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, హై స్పీడ్ డ్రైవింగ్‌లో కారును మేనేజ్ చేసేలా క్రూయిజ్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఈ కారు సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం.. టాటా పంచ్ కారును మీరు కూడా ఓసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది.
ఇది కూడా చదవండి : Hyundai Creta Car: రూ. 12 లక్షల SUV కారు రూ. 4.75 లక్షలకే.. టెంప్ట్ చేస్తోన్న ఆఫర్
ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే
ఇది కూడా చదవండి : Credit Card Bill Transfer: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతున్నారా ? ఇలా చేయండి
ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook