Tata Punch EV: త్వరలో విడుదల కానున్న టాటా పంచ్ ఈవీ.. సింగిల్ ఛార్జింగ్‌పై 300 కిమీల ప్రయాణం!

Tata Punch EV Launch and Price Details. టాటా పంచ్ ఈవీ ఇటీవల టెస్టింగ్ సమయంలో కెమెరాలకు చిక్కింది. టాటా పంచ్ ఈవీ దాని ఐసీఈ వెర్షన్‌ను పోలి ఉంటుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : May 15, 2023, 08:34 PM IST
Tata Punch EV: త్వరలో విడుదల కానున్న టాటా పంచ్ ఈవీ.. సింగిల్ ఛార్జింగ్‌పై 300 కిమీల ప్రయాణం!

Tata Punch EV Launch and Price Details: 'టాటా మోటార్స్' భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు 'టియాగో ఈవీ'ని మార్కెట్లోకి వదిలింది. టాటా కంపెనీ ఇప్పుడు అత్యధికంగా అమ్ముడవుతున్న పంచ్ యొక్క ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సంవత్సరం మధ్యలో ఈ కారుని విడుదల చేసే అవకాశం ఉంది. టాటా పంచ్ ఈవీ ఇటీవల టెస్టింగ్ సమయంలో కెమెరాలకు చిక్కింది. టాటా పంచ్ ఈవీ దాని ఐసీఈ వెర్షన్‌ను పోలి ఉంటుంది. అయితే ఇందులో కొన్ని మార్పులు ఉంటాయి.

టాటా పంచ్ ఈవీ దాని పెట్రోల్ వెర్షన్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంది. నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయని స్పై ఫొటోలు సూచిస్తున్నాయి. దీనికి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉంటుందట. మీడియా నివేదికలను ప్రకారం పంచ్ మైక్రో SUV Gen 2 (సిగ్మా) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండవచ్చు. ఇది ALFA ఆర్కిటెక్చర్ యొక్క అప్ డేటెడ్ వెర్షన్. టాటా యొక్క ఆల్ట్రోస్ ఆల్ఫా ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది. అయితే పంచ్ ఈవీ కోసం ఈ ప్లాట్‌ఫారమ్ సవరించబడుతుంది.

టాటా పంచ్ ఈవీ ఫ్లాట్ ఫ్లోర్‌ను కలిగి ఉంటుంది. తద్వారా పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను సులభంగా అమర్చవచ్చు. ఈ మినీ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Tiago EVలో కనిపించే చిన్న బ్యాటరీ ప్యాక్ 26kWh ఇందులో ఉంటుందని అంచనా. అదే సమయంలో నెక్సాన్ EV ప్రైమ్‌లో కనిపించే రెండవ బ్యాటరీ ప్యాక్ 30.2kWh ఉంటుంది. ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 300 కిమీల వరకు డ్రైవింగ్ చేయొచ్చు.

Also Read: సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం.. Nveda Joint Support పూర్తి వివరాలు ఇవే!  

Also Read: Prabhas No.1: టాలీవుడ్ నెంబర్ 1 ప్రభాసే.. ఏప్రిల్ లో కూడా తగ్గని రెబల్ స్టార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News