Tata Curvv Price: గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటర్స్ లాంచ్ చేసే ఈవీ కార్లకు మార్కెట్లో ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడింది. భారత్ విక్రయించే ఎలక్ట్రిక్ కార్లలో టాటా కంపెనీవే 70 శాతం ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాటా ప్రత్యేకమైన సెఫ్టీ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రావడం వల్ల చాలా మంది ఇవే కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని టాటా మోటర్స్ మార్కెట్లోకి మరో కారును లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన బ్యాటరీ సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు మార్కెట్లో టాక్. అలాగే కంపెనీ దీనికి ప్రత్యేకమైన పేరును కూడా ప్రకటించింది. దీనిని Tata Curvv పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కారు ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
టాటా కర్వ్ (tata curvv ev) ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ 2030 ఆటో ఎక్స్‌పోలో భాగంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ టాటా కర్వ్‌ను కంపెనీ 2024 సంవత్సరంలో చివరి నెలల్లో లాంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్‌లో భాగంగా రోడ్లపైకి వచ్చింది. అలాగే ఈ కారు విడుదలకు ముందే ఫోటోస్‌తో పాటు ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఇక ఈ టాటా కర్వ్ EVకు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..ఈ కారు ముందు భాగంలో వెడల్పు LED లైట్ బార్లను కలిగి ఉంటుంది. దీంతో పాటు స్ప్లిట్ LED హెడ్‌లైట్ సెటప్ ఆప్షన్స్‌ను కూడా తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌ను కూడా కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి రాబోయే టాటా కర్వ్ ఇటీవలే లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా EV, మారుతి సుజుకి eVX లతో పోటీపడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మైలేజీ రేంజ్:
Acti.ev ప్లాట్‌ఫారమ్‌లో లాంచ్ కాబోయే టాటా కర్వ్ (tata curvv ev) రెండవ మోడల్‌గా చెప్పొచ్చు. ఇటీవలే టాటా పంచ్ కూడా EV వేరియంట్లో వచ్చిన సంగంతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ టాటా కర్వ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లకుపైగా మైలేజీని అందిస్తుంది. దీంతో పాటు ఇది ప్రత్యేకమైన ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లెవల్-2 ADAS టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ కారు భద్రత కోసం 360-డిగ్రీ కెమెరా సెటప్‌తో రాబోతోంది. ఈ కారు మార్కెట్లోకి లాంచ్ అయితే ధర రూ.10.50తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి