TCS Womens Issue: టీసీఎస్‌లో మహిళలు మూకుమ్మడి రాజీనామాలు, కారణమేంటో తెలుసా

TCS Womens Issue: దేశంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రముఖమైంది. ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థగా పేరుంది. కానీ ఈ కంపెనీలో ఒక్కసారిగా పెద్దసంఖ్యలో మహిళలు రాజీనామా చేస్తున్నారు. దీనికి కారణమేంటో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 13, 2023, 07:14 PM IST
TCS Womens Issue: టీసీఎస్‌లో మహిళలు మూకుమ్మడి రాజీనామాలు, కారణమేంటో తెలుసా

TCS Womens Issue: టాటా కన్సల్టెన్సీ సర్వీసెట్ స్థూలంగా టీసీఎస్‌గా పిల్చుకునే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి. ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థగా, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే కంపెనీగా పేరున్న టీసీఎస్‌కు ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ విచిత్ర పరిస్థితి ఏంటో తెలుసుకుందాం..

టీసీఎస్ కంపెనీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు రాజీనామా చేస్తుండటం కంపెనీకు మింగుడుపడటం లేదు. కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. ఆ తరువాత కంపెనీ ఎగుడుదిగుడులకు లోనైంది. దాంతో కంపెనీ వర్క్ ఫ్రం హోం ఆప్షన్ తొలగించి విధిగా ఆఫీసుకు రావల్సిందిగా కోరింది. అంటే వర్క్ ఫ్రం హోం ఆప్షన్ తొలగించేసింది. ఎప్పుడైతే కంపెనీ వర్క్ ఫ్రం హోం తొలగించిందో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాజీనామాలు సమర్పించడం ప్రారంభమైంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీని సహజంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే సంస్థగా చెప్పుకుంటారు. మహిళలకు ఇందులో అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ పెద్ద సంఖ్యలో ఇదే కంపెనీ నుంచి మహిళా ఉద్యోగులు రాజీనామాలు ఇచ్చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం తొలగించడం వల్ల రాజీనామా చేస్తున్నారని టీసీఎస్ వివరణ ఇచ్చుకుంది. టీసీఎస్ హెచ్‌ఆర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. వర్క్ ఫ్రం హోం తొలగించిన తరువాత మహిళలు పెద్దసంఖ్యలో రాజీనామా చేస్తున్నారని. మహిళా ఉద్యోగుల రాజీనామాకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు కానీ వర్క్ ఫ్రం హోం తొలగించడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది. టీసీఎస్ లో సాధారణంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా రాజీనామా చేస్తుంటారు కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. టీసీఎస్‌లో 6 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 35 శాతం మంది మహిళా ఉద్యోగులే. టీసీఎస్ నుంచి గత ఆర్ధిక సంవత్సరంలో 20 శాతం సిబ్బంది మానేశారు.  
ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా కంపెనీల్లో వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కఠిన మాంద్యం కొనసాగుతున్నా వర్క్ ఫ్రం హోంకు మంచి స్పందన లభిస్తోంది. అయితే టీసీఎస్ వర్క్ ఫ్రం హోం తొలగించడంపై మహిళలు రాజీనామా చేయడంపై కంపెనీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

Also read: Forbes List 2023: ఫోర్బ్స్ కొత్త జాబితా విడుదల, ప్రపంచ టాప్ కంపెనీల్లో 45వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News