Sukanya Samriddhi Yojana: తల్లిదండ్రులందరూ కుమార్తెల భవిష్యత్ అందంగా ఉండాలనుకుంటారు. చదువు కోసం, పెళ్లి కోసం ప్రతి నెలా కొంత పొదుపు చేస్తుంటారు. దీనికోసం పెద్దమొత్తంలో డబ్బులు అవసరమౌతాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన అద్బుతంగా ఉపయోగపడుతుంది. ఈ పధకాన్ని క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే లక్షలు జమ చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన పధకంతో అమ్మాయిల భవిష్యత్ చక్కదిద్దవచ్చు. అమ్మాయిల చదువు, పెళ్లి కోసం ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ పధకంలో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌పై ట్యాక్స్ మినహాయింపు కూడా వర్తిస్తుంది. ఈ పధకంలో ప్రతి నెలా 12,500 రూపాయలు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే చివరికది 70 లక్షలు కావచ్చు. ఇంట్లో ఆడబిడ్డ చదువు, భవిష్యత్, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం ఈ పధకాన్ని రూపుదిద్దింది. అన్ని పోస్టాఫీసుల్లో ఈ పధకం అందుబాటులో ఉంది. ఈ పధకం కింద అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది ఏడాదికోసారి ఉంటుంది. పదేళ్లలోపు ఆడబిడ్డ పేరుపై తల్లిదండ్రులు ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు
ఈ పధకంలో కనీస ఇన్వెస్ట్‌మెంట్ 250 రూపాయలు కాగా గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పధకం 15 ఏళ్లకు ఉంటుంది. ఏడాదికోసారి కూడా డిపాజిట్ చేయవచ్చు. 15 ఏళ్లు పూర్తయ్యాక ఆ అమ్మాయికి 18 ఏళ్లు నిండితే ఆ డబ్బుల్ని విత్ డ్రా చేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఎక్కౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 21 ఏళ్లయితే క్లోజ్ అయిపోతుంది. లేదా ఆ అమ్మాయి పెళ్లయితే ఎక్కౌంట్ క్లోజ్ అవుతుంది.
70 లక్షలు ఎలా వస్తాయంటే
నెలకు 12,500 రూపాయల చొప్పున ఏడాదికి 1,50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్లకు మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ 22,50,000 అవుతుంది. దీనిపై ఏడాదికి 8.20 శాతం వడ్డీ లెక్కిస్తే 46,77,578 రూపాయలవుతుంది. అంటే మెచ్యూరిటీ పూర్తయ్యేసరికి వడ్డీతో కలుపుకుని 69,27,578 రూపాయలు చేతికి అందుతాయి.
Also read: Aadhaar Card Update: పదేళ్లు దాటిన ఆధార్ కార్డులు పనిచేయవా, యూఐడీఏఐ ఏం చెబుతోంది, ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook