Sukanya samriddhi yojana: సుకన్య సమృద్ధి యోజన..కుటుంబంలో ఎంతమందికి చేయొచ్చు

Sukanya samriddhi yojana: ఇంట్లో ఆడపిల్ల పుడితే భవిష్యత్ రక్షణకై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమిది. ఈ పథకంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ మరింత ప్రయోజనకరంగా మార్చుతున్నారు. తాజాగా ఈ పధకంలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 20, 2022, 11:39 PM IST
Sukanya samriddhi yojana: సుకన్య సమృద్ధి యోజన..కుటుంబంలో ఎంతమందికి చేయొచ్చు

Sukanya samriddhi yojana: ఇంట్లో ఆడపిల్ల పుడితే భవిష్యత్ రక్షణకై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమిది. ఈ పథకంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ మరింత ప్రయోజనకరంగా మార్చుతున్నారు. తాజాగా ఈ పధకంలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం..

వాస్తవానికి సుకన్య సమృద్ధి యోజన పధకం చాలాకాలం క్రితమే ప్రారంభమైనా..ఇటీవల కొత్త నియమాలు చోటుచేసుకున్నాయి. మీరు కూడా మీ కుమార్తె భవిష్యత్ కోసం ఆలోచిస్తుంటే ఈ పధకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 21 ఏళ్లకే మీ అమ్మాయి లక్షాధికారి కావచ్చు. దీనికోసం రోజుకు 416 రూపాయలు పొదుపు చేస్తే చాలు. మీ అమ్మాయి 21 ఏళ్లు వచ్చేసరికి 65 లక్షల రూపాయలవుతుంది. మీ అమ్మాయి భవిష్యత్ చదువు,పెళ్లి ఖర్చులకు ఈ పథకం బాగా ఉపయుక్తమౌతుంది.

ఆడపిల్లల సంరక్షణ, భవిష్యత్ కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన అనేది దీర్ఘ కాలిక పధకం. ఇందులో పెట్టుబడి పెడితే మీ కుమార్తె చదువు, భవిష్యత్ విషయంలో ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని పెద్దగా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడీ స్కీమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త నియమాల ప్రకారం...ఎక్కౌంట్‌లో వడ్డీ పొరపాటున జమ అయితే..తిరిగి తీసుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా వార్షిక వడ్డీ ప్రతి ఆర్ధిక సంవత్సరం చివర్లో క్రెడిట్ అవుతుంది. ఇంతకుముందైతే..మీ కుమార్తెకు పదేళ్ల వయస్సుంటేనే ఎక్కౌంట్ ఆపరేట్ చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం 18 ఏళ్ల కంటే ముందు ఎక్కౌంట్ ఆపరేట్ చేసే పరిస్థితి లేదు. 18 ఏళ్ల తరువాతే ఎక్కౌంట్ ఆపరేట్ చేయగలరు. 

ఇంట్లో ఎంతమందికి సుకన్య సమృద్ధి పథకం వర్తిస్తుంది

ఇంతకుముందు ఇదే పథకంలో ఇద్దరు కుమార్తెల ఖాతాలపై కూడా సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉండేది. మూడో కుమార్తె ఎక్కౌంట్‌పై ఉండేది కాదు. ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం ఒక అమ్మాయి తరువాత ఇద్దరు ట్విన్స్ అమ్మాయిలు పుడితే మాత్రం ఆ ఇద్దరికి కూడా ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. దీని ప్రకారం ఎక్కౌంట్‌లో కనీసం ఏడాదికి 250 రూపాయలు జమ చేయాలి. అలా కానిపక్షంలో ఎక్కౌంట్ డీఫాల్ట్ అవుతుంది. కానీ కొత్త నియమాల ప్రకారం ఒకవేళ ఖాతాను రెండోసారి యాక్టివ్ చేయకపోతే మెచ్యూరిటీ అయ్యేంతవరకూ అందులో ఉన్న నగదుపై వడ్డీ లభిస్తుంది. 

ఎప్పుడు క్లోజ్ చేయవచ్చు

సుకన్య సమృద్ధి యోజన పథకం కింద తెరిచిన ఎక్కౌంట్‌ను గతంలో రెండు సందర్భాల్లోనే క్లోజ్ చేయడానికుండేది. కుమార్తె చనిపోయినప్పుడు , కుమార్తె నివాసముండే చిరునామా మారినప్పుడు. ఇప్పుడా పరిస్థితి లేదు. 

Also read: PMVVY Scheme: సీనియర్ సిటిజెన్ పెన్షన్ స్కీమ్, నెలకు 9 వేల పెన్షన్, ఎలా అప్లై చేయాలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News