Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజన ఎక్కౌంట్ ఎలా చెక్ చేయాలి

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అమ్మాయి భవిష్యత్ సంరక్షణకై కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పధకమిది. మీ అమ్మాయి ఎక్కౌంట్‌లో ఎన్ని డబ్బులున్నాయో ఇలా చెక్ చేసుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 26, 2024, 07:19 PM IST
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజన ఎక్కౌంట్ ఎలా చెక్ చేయాలి

Sukanya Samriddhi Yojana: ఇంట్లో ఆడపిల్లల భవిష్యత్ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభించిన పధకం సుకన్య సమృద్ధి యోజన. పిల్లల ఆర్ధిక సంరక్షణ, చదువు నిమిత్తం లేదా స్వయం ఉపాధికి పెట్టుబడి కోసం ఉద్దేశించిన పధకమిది. 

సుకన్య సమృద్ది యోజన పధకంలో మీ అమ్మాయి పేరు మీద ఎన్ని డబ్బులు జమ అయున్నాయో తెలుసుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా సులభం. దీనికోసం సుకన్య సమృద్ధి యోజన అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మీ ఎక్కౌంట్‌లోకి లాగిన్ కావాలి. ఇ్పుడు మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. పూర్తిగా లాగిన్ అయిన తరువాత మీ సుకన్య సమృద్ధి యోజన ఎక్కౌంట్ ఎంచుకోవాలి. 

మీ అమ్మాయికు సంబంధించిన సుకన్య సమృద్ధి యోజన ఓపెన్ అయిన తరువాత ఎక్కౌంట్‌కు సంబంధించిన మొత్తం డేటా లభ్యమౌతుంది. చివరి సారిగా ఎప్పుడు ఎంత డిపాజిట్ అయింది, వడ్డీ ఎంత పడిందనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పధకం ద్వారా మీ అమ్మాయికి ఆర్ధిక సంరక్షణ అందించగలగడమే కాకుండా ఆమె చదువుకు కూడా ఉపయోగపడుతుంది. 

Also read: NPS Withdrawal Rules: ఎన్‌పీఎస్ నిబంధనల్లో మార్పులు.. ఆ సౌకర్యంతో ఎంతో మేలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News