Multibagger Stocks News : ఈ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ల పంట పండింది

Multibagger Stocks News : 2023లో మల్టీబ్యాగర్ స్టాక్స్ జాబితాలో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చోటు సంపాదించుకున్నాయి. అలా చోటు సంపాదించుకున్న మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ బ్యాంక్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఆ బ్యాంకులు ఏంటి, ఏయే బ్యాంకులు ఎంత శాతం లాభాలు తెచ్చిపెట్టాయి అనేది ఇప్పుడు చూద్దాం.

Written by - Pavan | Last Updated : Jul 9, 2023, 12:04 AM IST
Multibagger Stocks News : ఈ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ల పంట పండింది

Multibagger Stocks News : మల్టీబ్యాగర్ స్టాక్స్: స్టాక్ మార్కెట్ వరుసగా రికార్డు స్థాయిలో అప్పర్ మార్క్ తాకుతున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు సూపర్ పర్ ఫామ్ చేస్తూ మల్టీబ్యాగర్ స్టాక్స్ జాబితాలో చేరాయి. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న బ్యాంకింగ్ స్టాక్స్ గత ఏడాది కాలంలో మంచి స్థాయిలో తిరిగి పుంజుకున్నాయి. దీంతో 2023లో మల్టీబ్యాగర్ స్టాక్స్ జాబితాలో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చోటు సంపాదించుకున్నాయి. అలా చోటు సంపాదించుకున్న మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ బ్యాంక్ స్టాక్స్ కూడా ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ నిఫ్టీ, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సెన్సెక్స్‌ల కంటే ముందుగా బ్యాంక్ నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిని తాకడమే ఈ ఏడాది బ్యాంక్ స్టాక్స్ అత్యుత్తమ పర్‌ఫార్మెన్స్‌కి ఒక నిదర్శనం. ఇక మల్టీబ్యాగర్ స్టాక్స్ గా నిలిచిన బ్యాంక్ స్టాక్స్ జాబితాను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.

1) కరూర్ వైశ్యా బ్యాంక్ : కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్ ధర గత ఏడాది కాలంగా పైపైకి ఎగబాకుతూనే ఉంది. కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్ ధర ఒక్క గత నెల రోజుల్లోనే 15 శాతానికి పైగా పెరిగింది. గత ఆరు నెలల్లో దాదాపు 20 శాతం పెరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక గత సంవత్సరం కాలం విషయానికొస్తే..  కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు ధర ఏడాది క్రితం రూ. 45 వద్ద ఉండగా.. అక్కడి నుండి పెరుగుతూ పెరుగుతూ 129 రూపాయల రికార్డు స్థాయికి చేరింది. అంటే ఏడాది కాలానిపైగా కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్స్‌ని అలాగే దాచుకున్న షేర్‌హోల్డర్స్ దాదాపు 180 శాతం లాభం సంపాదించుకున్నారు.

2) కర్ణాటక బ్యాంక్ : ఈ ప్రైవేట్ బ్యాంక్ స్టాక్ ధర గత నెల రోజులుగా పైపైకి వెళ్తోంది. కర్ణాటక బ్యాంక్ స్టాక్ ధరను పరిశీలిస్తే.. ఒక్క నెల రోజుల్లోనే సుమారు రూ. 148 నుండి రూ. 193 స్థాయికి పెరిగింది. అంటే 30 రోజుల్లో 30 శాతం పెరిగిందన్నమాట. అలాగే గత ఏడాది కాలంలో కర్ణాటక బ్యాంక్ స్టాక్ ధర దాదాపు రూ. 67.50 నుండి 185 శాతం వరకు పెరిగి రూ. 193 మార్కుని తాకడం విశేషం.

3) ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్స్ గత నెల రోజుల్లోనే 10 శాతం కంటే ఎక్కువ లాభాన్ని అందించాయి. గత ఆరు నెలల కాల వ్యవధిలో  65 శాతం పెరిగింది. గత సంవత్సర కాలంలో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ ధర రూ. 40 నుండి రూ. 93.80 చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ జీవితకాల గరిష్ట స్థాయి రూ. 94.90 కాగా.. ప్రస్తుతం స్టాక్ ధర ఒక్క అడుగు దూరంలోనే ఉంది. గత ఏడాది కాలంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 135 శాతం పెరిగి మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిచింది.

4) ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ : ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో బాగా పర్‌ఫామ్ చేసిన ప్రైవేట్ బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ ధర రూ. 61 నుండి రూ. 80 వరకు పెరిగింది. ఇయర్ టు డేట్ పరంగా చూసుకుంటే దాదాపు 30 శాతం లాభాలు రాబట్టింది. ఒక్క గడిచిన సంవత్సరం కాలంలోనే ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ షేర్ రూ. 33.75 నుండి రూ. 80 వరకు పెరిగింది. అంటే ఇందులో పెట్టుబడి పెట్టిన లాంగ్ టర్మ్ షేర్‌హోల్డర్స్ దాదాపు 135 శాతం లాభాలు సంపాదించారన్నమాట.

5) ఆర్బీఎల్ బ్యాంక్ : ఏడాది క్రితం రూ. 83 వద్ద ట్రేడ్ అయిన ఈ ప్రైవేట్ బ్యాంక్ షేర్స్ ప్రస్తుతం రూ. 184 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంటే గడిచిన ఏడాది కాలంలో ఆర్బీఎల్ స్టాక్స్ 113 శాతం పెరిగియి. అప్పటికి , ఇప్పటికీ ఈ బ్యాంక్ షేర్స్‌లో రూ. 98 పెరుగుదల నమోదైంది.

Trending News