PSU Stock : ఈ ప్రభుత్వ కంపెనీ షేర్లలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి 5 ఏళ్లు మరిచిపోయి ఉంటే మీకు రూ. 11 లక్షలు దక్కేవి..!!

Multibagger stocks : స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు మనకు అదృష్టం తలుపు తట్టినట్లు కొన్ని స్టాక్స్ లభిస్తూ ఉంటాయి. ఆ స్టాక్స్ ని కొనుగోలు చేయడం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు కాదు ఏకంగా పదింతలు సైతం అవుతూ ఉంటుంది. వీటినే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. అలాంటి ఓ ప్రభుత్వ రంగ సంస్థ షేర్ల గురించి తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Aug 12, 2024, 11:05 PM IST
PSU Stock : ఈ ప్రభుత్వ కంపెనీ షేర్లలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి 5 ఏళ్లు మరిచిపోయి ఉంటే మీకు రూ. 11 లక్షలు దక్కేవి..!!

Shipping Corporation: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందాలని చూస్తున్నారా. అయితే మీరు నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లయితే, మీరు సరైన అవగాహన లేకపోతే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదైనా స్టాక్ ఎంపిక చేసుకున్నప్పుడు ఆఫ్ కంపెనీ సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం ప్రాథమిక సూత్రం. ముఖ్యంగా ఆ కంపెనీ ఫండమెంటల్స్ టెక్నికల్స్ పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం అనేది కనీస కర్తవ్యం. అయితే ప్రస్తుతం మీరు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల్లో ఎలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుందని ఆలోచిస్తున్నట్లయితే, ఫండమెంటల్ స్వరంగా బలంగా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుంటే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. 

ఎందుకంటే ఫండమెంటట్స్ ఫరంగా బలంగా ఉన్న కంపెనీలు లాంగ్ టర్మ్ లో మంచి ఆదాయాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం ఫండమెంటల్స్ పరంగా బలంగా ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంస్థ పేరు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్టాక్ ఆగస్టు 12వ తేదీ అంటే నేడు రూ. 275 వద్ద గరిష్ట స్థాయిని తాకింది ఈ కంపెనీ క్యూ 1 రిజల్ట్స్ లో చక్కటి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కంపెనీ ఆదాయం గత సంవత్సరంతో పోల్చితే 69% మెరుగుపడింది.
 
ఈ PSU మంచి Q1 రిజల్ట్స్ అనంతరం సోమవారం నాటి సెషన్‌లో (ఆగస్టు 12) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI) షేర్లు రోజు గరిష్ట స్థాయి వద్ద 7 శాతం వరకు పెరిగి రూ.275కి చేరుకున్నాయి. రిపోర్టింగ్ త్రైమాసికంలో, కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ. 291 కోట్లుగా ఉంది, ఇది సంవత్సరానికి 69.1 శాతం పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.171 కోట్లు. శుక్రవారం సెషన్‌లో ప్రభుత్వ రంగ సంస్థ షేర్లు స్వల్పంగా 0.29 శాతం క్షీణించి రూ. 257.35 వద్ద ముగిశాయి. 

Also Read : Family Pension : ప్రైవేట్ ఉద్యోగులూ..మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ లో చేరండి..!!

కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 26.1 శాతం పెరిగి రూ.1,514 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వరుసగా రూ.1,412 కోట్లు, కంపెనీ మార్జిన్ కూడా గతేడాది ఇదే త్రైమాసికంలో 30.25 శాతం నుంచి Q1FY24లో 33.6 శాతానికి పెరిగింది.

SCI అనేది భారత ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ (PSU). ఇది భారతదేశంలో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ, జాతీయ, అంతర్జాతీయ మార్గాల కోసం నౌకలను నిర్వహిస్తుంది. ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న SCIని నిర్వహిస్తుంది.

ఇక ఈ స్టాక్ విషయానికి వస్తే 2019 ఆగస్టులో ఈ కంపెనీ ఒక షేర్ ధర కేవలం రూ. 25 వద్ద ఉంది. అంటే ఆ ఏడాది మీరు 25 రూపాయల చొప్పున 1000 షేర్లు కొనుగోలు చేసినట్లయితే, మీరు దాదాపు 25000 రూపాయల వరకూ పెట్టుబడి పెట్టి ఉంటారు. ప్రస్తుతం ఈ షేరు ధర 274 రూపాయలు వద్ద పలుకుతుండగా, జూలై 12వ తేదీన ఈ షేరు ధర రూ. 345 వరకూ గరిష్టంగా పలికింది. ఈ లెక్కన 1000 షేర్లకు గానూ రూ. 345 చొప్పున లెక్క వేస్తే మీ షేర్ల విలువ 3,45,000 రూపాయలు అయి ఉండేవి.

Also Read : Ola Shares: మార్కెట్లో జెట్ స్పీడ్‎తో దూసుకెళ్తున్న ఓలా..వరుసగా రెండోరోజు 20శాతం పెరిగిన షేరు..!!

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News