షేర్ మార్కెట్‌లో కేవలం షేర్ల ధరలు పెరగడం ద్వారానే డబ్బులు సంపాదించరు. సమయానుకూలంగా కంపెనీలిచ్చే డివిడెండ్స్ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటిదే టాటా గ్రూప్‌కు చెందిన ఈ షేర్. ఆ వివరాలు మీ కోసం..
టాటా గ్రూప్‌కు చెందిన ఈ స్టాక్ ఈ ఏడాదిలో 4 సార్లు డివిడెండ్ ఇచ్చింది. నాలుగుసార్లు డివిడెండ్ రూపంలో 45 రూపాయలు పెరిగింది. ఇప్పుడు అదే షేర్ బై బ్యాక్ ప్రకటన వచ్చింది. దీర్ఘకాలిక షేర్ల మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు కంపెనీ ఎప్పటికప్పుడు ఇచ్చే పురస్కారమే డివిడెండ్. ఈ పురస్కారం బోనస్ షేర్, రైట్స్ ఇష్యూ,షేర్ల బైబ్యాక్ వంటివి ఉంటాయి.
కొన్ని లిస్టెడ్ కంపెనీలు తమ షేర్ హోల్డర్లకు దీర్ఘకాలిక లబ్దిని ఆలస్యంగా చేకూరుస్తుంటాయి. కొన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు ఇస్తుంటాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్థూలంగా టీసీఎస్ షేర్ మార్కెట్‌లో అటువంటిదే. 2022లో టీసీఎస్ నాలుగు సార్లు లాభాల్ని ప్రకటించింది. దాంతోపాటు షేర్ బైబ్యాక్ ప్రకటన చేసింది.
టీసీఎస్ డివిడెండ్ 2022
2022 ఆర్ధిక సంవత్సరంలో టీసీఎస్ నాలుగు సార్లు లాభాలు ప్రకటించింది. 2022 జనవరిలో టీసీఎస్ 2021-22 ప్రతి షేరుపై 7 రూపాయల లాభం ప్రకటించింది. మే 2022లో ప్రతి షేరుకు 22 రూపాయలు లాభం నమోదు చేసింది. ఆ తరువాత జూలై 2022లో ప్రతిషేరుపై 8 రూపాయలు లాభం ప్రకటించింది. ఆ తరువాత అక్టోబర్ 2022లో ప్రతి షేర్‌పై 8 రూపాయలు లాభం ఇచ్చింది. మిడ్ క్యాప్ ఈక్విటీ స్టాక్ నాలుగు సందర్భాల్లో లాభాలు అందించింది. అంటే మొత్తం ఏడాదిలో 55 రూపాయలు లాభం ఆర్జించింది.
టీసీఎస్ డివిడెండ్ లాభం
టీసీఎస్ షేర్ విలువ ఇప్పుడు 3217 రూపాయలుంది. లాభం ఏడాదిలో ప్రతి షేర్ పై 55 రూపాయలు వచ్చింది. డీవిడెండ్ లాభం దాదాపు 1.71 శాతముంది.
టీసీఎస్ షేర్ల బైబ్యాక్
ఫిబ్రవరి 2022లో ప్రతి షేర్‌కు 4500 రూపాయల చొప్పున బైబ్యాక్ ప్రకటించింది. షేర్ల బైబ్యాక్ గురించి భారతీయ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్‌లకు సూచించింది. కంపెనీ తన ఫ్రీ రిజర్వ్ 18 వేల కోట్ల కంటే ఎక్కువ వినియోగించడం లేదని వెల్లడించింది. సెప్టెంబర్ 2022 త్రైమాసికం క్లోజింగ్‌పై టీసీఎస్ పూర్తి లాభం ఏడాది క్రితం త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం పెరిగి 10,431 రూపాయలైంది. జూలై-సెప్టెంబర్ ఆర్ధిక సంవత్సరం 2023 కు కంపెనీ ఆర్డర్ బుకింగ్ విలువ 8.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
Also read: Two Wheeler Sales: ఏపీలో క్షీణించిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook