Marsons Limited Share Price: చాలా మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు నమ్మకం ఉన్న కంపెనీల గురించి తెలుసుకుంటారు. అలాంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లయితే తమకు ఢోకా ఉండదనుకుంటారు. ముఖ్యంగా మీరు సెలక్ట్ చేసుకున్న కంపెనీలు ఫండమెంటల్స్ పరంగానూ..అదే విధంగా టెక్నికల్ పరంగానూ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంతేకాదు ఈ కంపెనీ వ్యాపారంలో రాణించి ఉండాలి. అయితే పవర్ ప్రాజెక్ట్ సంబంధిత కంపెనీ అయిన మార్సన్స్ లిమిటెడ్ షేర్లు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి.
గత ఏడాది కాలంలోనే ఈ షేరు విలువ దాదాపు 5000 శాతం పెరిగింది. దీంతో ఏడాది క్రితం షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి భారీ మొత్తంలో లాభాలు వస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లను తయారు చేసి పంపిణీ చేసే ఈ కంపెనీ షేర్లు శుక్రవారం 5 శాతం పెరిగి రూ.280.90కి చేరాయి. దీంతో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మార్సన్స్ లిమిటెడ్ ఇటీవల రూ.675 కోట్ల విలువైన పెద్ద ఆర్డర్‌ను అందుకుంది. గత నెల రోజుల్లోనే ఈ స్టాక్ దాదాపు 150 శాతం పెరిగింది.
అంతేకాదు 675 కోట్ల విలువైన ఆర్డర్‌ను మార్సన్స్ లిమిటెడ్ పొందిందని కంపెనీ తరపున ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ 150 MW గ్రిడ్-ఇంటరాక్టివ్ గ్రౌండ్-మౌంటెడ్ సోలార్ PV పవర్ జనరేషన్ ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి NACOF పవర్ నుండి LOIని అందుకుంది. 675 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును 12 నుంచి 18 నెలల్లో పూర్తి చేయనున్నారు. రానున్న కాలంలో కంపెనీ షేర్లు మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Car: డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేశారో.. మీ కారు షెడ్డుకు పోవాల్సిందే
మార్సన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం రూ.13.35 (4.99%) పెరుగుదలతో రూ.280.90కి చేరింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయి కంటే ఎక్కువ. షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.5.32. గత నెల రోజుల్లోనే ఈ స్టాక్ 150 శాతం పెరిగినట్లు తెలిపింది. ఆరు నెలల గురించి తెలుసుకుంటే ఈ స్టాక్ 680 శాతం పెరిగింది. అయితే ఈ స్టాక్ ఒక్క ఏడాదిలో 4900 శాతం మేర పెరిగింది. కంపెనీ షేరు 27 సెప్టెంబర్ 2023 రూ. 5.60 వద్ద ఉంటే ఇప్పుడు ఒక ఏడాది తర్వాత, 27 సెప్టెంబర్ 2024న, షేర్ రూ. 280.90కి చేరుకుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు మార్సన్ షేర్లు దాదాపు 3400 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
లక్ష 53 లక్షలు ఎలా అయింది?
జనవరి 1న ఏడాది ప్రారంభంలో ఈ షేర్ రూ.8.03 స్థాయిలో ఉంది. ప్రస్తుతం, మార్సన్స్ లిమిటెడ్ షేర్లు BSEలో Z గ్రూప్ స్టాక్స్ కింద ట్రెండింగ్‌లో ఉన్నాయి. 28 సెప్టెంబర్ 2023న షేర్ ధర రూ. 5.32. ఏడాది క్రితం రూ.లక్ష విలువైన ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్‌కు 18,797 షేర్లు వచ్చేవి. అప్పటి నుంచి ఆ ఇన్వెస్టర్ తన పెట్టుబడిని అలాగే ఉంచి ఉంటే ఈరోజు ఈ షేర్ల ధర రూ.52.80 లక్షలకు పెరిగేది.
Also Read: Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్..వాటికి మాత్రం ఫుల్ డిమాండ్..తగ్గేదేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook