SBI Internet Banking Services: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్, YONO ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

SBI Internet Banking Services: రెండు గంటలకు పైగా సమయం ఎస్‌బీఐ ఖాతాదారులకు ఆన్‌లైన్, డిజిటల్ సర్వీసులలో స్వల్ప అంతరాయం కలిగింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు, ఇతర ఆన్‌లైన్ సంబంధిత సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2021, 08:44 AM IST
SBI Internet Banking Services: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్, YONO ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

SBI Internet Banking Services: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank of India) కస్టమర్లకు డిజిటల్ సర్వీసులలో మరోసారి అంతరాయం తలెత్తింది. అయితే ఇందుకు సంబంధించి ఎస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుగానే తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.

గత నెలలో రెండు పర్యాయాలు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేసిన భారతీయ స్టేట్ బ్యాంక్ తాజాగా మరోసారి మెయింటనెన్స్ పనులకు నిర్ణయం తీసుకోవడంతో రెండు గంటలకు పైగా సమయం ఎస్‌బీఐ ఖాతాదారులకు ఆన్‌లైన్, డిజిటల్ సర్వీసులలో స్వల్ప అంతరాయం కలిగింది. జులై 4న ఉదయం 3.25 గంటల నుంచి ఉదయం 5.50 గంటల వరకు ఎస్‌బీఐ (State Bank Of India) అన్ని రకాల ఆన్‌లైన్, డిజిటల్ సేవలు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని ఒకరోజు ముందుగానే ట్విట్టర్ ద్వారా ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ యోనో, యోనో లైట్, యూపీఐ ఆధారిత సేవలు, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సేవల విషయంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు అంతరాయం ఏర్పడింది.

Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే

ఎస్‌బీఐ ఆన్‌లైన్, డిజిటల్ సేవల పునరుద్దరణ
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు (SBI New Charges), ఇతర ఆన్‌లైన్ సంబంధిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం మెయింటనెన్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లాంటి కారణాలతో ఎస్‌బీఐ సేవలకు అంతరాయం కలుగుతుంది. అయితే ఈ విషయాన్ని తమ ఖాతాదారులకు ముందుగానే ప్రకటన ద్వారా తెలుపుతుంది. బ్యాంకు ఖాతా, ఇంటర్నెట్ ఖాతాలలో లోపం తలెత్తిందని ఆందోళన చెందనక్కర్లేదని ఎస్‌బీఐ తన ఖాతాదారులకు సూచించింది. దేశవ్యాప్తంగా 22,000కు పైగా ఎస్‌బీఐ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. రికార్డు స్థాయిలో 57,889 ఏటీఎం కేంద్రాలు సైతం తమ ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ ఏర్పాటు చేసి సేవల్ని విస్తరించింది.

Also Read: Bank Holidays In July 2021: జులై నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్, మీ బ్యాంక్ పనులు షెడ్యూల్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News