SBI Amrit Kalash Deposit FD Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇదే ఏడాది ఫిబ్రవరి 15న అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ పేరుతో ఒక ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి 7.10 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఒకవేళ డిపాజిటర్స్ సీనియర్ సిటిజెన్స్ అయినట్టయితే.. వారికి అదనంగా మరో .50 బేసిస్ పాయింట్స్ కలిపి మొత్తం 7.60 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఇతర బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లతో పోల్చుకుంటే ఇదే అత్యధిక వడ్డీ రేటు అని ఎస్బీఐ చెబుతోంది.
అయితే, అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరాలనుకునే వారికి ఒక ముఖ్యమైన గమనిక. ఈ స్కీమ్ కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి ఒక చివరి గడువు ఉంది. ఆ చివరి గడువు రేపే.. అంటే మార్చి 31 ఆఖరి తేది అన్నమాట.
అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కాల వ్యవధి 400 రోజులు. మన దేశంలో ఉన్న వారే కాకుండా ఎన్నారై కస్టమర్స్ సైతం ఈ అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టి అధిక వడ్డీ రూపంలో అధిక మొత్తంలో రిటర్న్ పొందొచ్చు.
Introducing “Amrit Kalash Deposit” for domestic and NRI customers with attractive interest rates, 400 days tenure and much more.
*T&C Apply#SBI #Deposit #AzadiKaAmritMahotsav pic.twitter.com/mRjpW6mCvS— State Bank of India (@TheOfficialSBI) February 15, 2023
అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌తో సంబంధం లేకుండా వివిధ కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్బీఐ ఆఫర్ చేస్తోన్న వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే.. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల మధ్య కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై ఎస్బీఐ 7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అలాగే మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య కాల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై 6.25 శాతం నుంచి 6.5 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఒకవేళ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తోన్న అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరాలనుకుంటే.. అందుకు రేపు మార్చి 31వ తేదీనే చివరి రోజు అనే విషయం మర్చిపోవద్దు.
ఇది కూడా చదవండి : Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఇది కూడా చదవండి : Hyundai Creta Cars: 12 నుంచి 21 లక్షల విలువైన కారు రూ. 8 లక్షలకే.. వెంటనే కారు మీ చేతికి.. ఎగబడుతున్న జనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK