SBI Alert: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ఖాతా దారులకు అలర్ట్. ఇటీవల జరిగిన బ్యాంక్ మోసాలను వివరిస్తూ.. కస్టమర్లు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించింది. తాజాగా సైబర్ మోసాగాల్లు కొత్త కొత్త మార్గాల్లో.. కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేస్తున్నారని అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కస్టమర్లందరికీ కీలక సూచనలు జారీ చేసింది.
మోసాలు ఎలా జరుగుతున్నాయి?
ఇటీవల ఓటీపీలు కనుక్కుని మోసాలు చేసే నేరగాళ్ల గురించి జనాల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు సైబర్ మోసగాళ్లు. ఇందుకోస బ్యాంక్ కస్టమర్లకు ఎస్బీఐ నుంచి చేసినట్లుగా ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు.
అచ్చం ఎస్బీఐ నుంచి వచ్చినట్లుగానే ఈ ఎస్ఎంఎస్లు ఉంటాయని. అందులో మీ కేవైసి వివరాలు అప్డేట్ చేయాలని, 24 గంటల్లో పూర్తి చేయకుంటే బ్యాంక్ సేవలు నిలిచిపోతాయని ఉంటోంది.
ఆ ఎస్ఎంఎస్ నిజమైందని నమ్మి ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. అందుల ఓ పేజీకి తీసుకెళ్తుంది. ఆ వ్యక్తిగత వివరాలన్నీ కోరుతుంది. వాటన్నింటిని ఎంటర్ చేసి.. ఓటీపీ వెరిఫికేషన్ వంటివి పూర్తి చేస్తే.. అంతే సంగతులు. ఆ వివరాలన్నింటితో సైబర్ నేరగాళ్లు.. ఆయా వ్యక్తుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్న బ్యాంక్ కస్టమర్లు.. తమ ఖాతాలో డబ్బు పోయిందని గ్రహిస్తున్నారు.
అయిత ఆలాంటి ఎస్ఎంఎస్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన ఎస్బీఐ తాజా ట్వీట్లో కస్టమర్లకు సూచించింది. ఎస్బీఐ ఎప్పుడు కూడా కేవైసీ అప్డేట్ చేయాలని లింక్‌లు పంపదని స్పష్టం చేసింది. అలాంటి ఎస్ఎంఎస్లు వస్తే వెంటనే వాటిని డిలీట్ చేయాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లో వాటిని క్లిక్ చేయొద్దని సూచించింది. అలాంటి ఎస్ఎంఎస్లు మళ్లీ మళ్లీ వస్తుంటే.. సైబర్ క్రైమ్ పోలీసులకు తెలపాలని సలహా ఇచ్చింది.
Here is an example of #YehWrongNumberHai, KYC fraud. Such SMS can lead to a fraud, and you can lose your savings. Do not click on embedded links. Check for the correct short code of SBI on receiving an SMS. Stay alert and stay #SafeWithSBI.#SBI #AmritMahotsav pic.twitter.com/z1goSyhGXq
— State Bank of India (@TheOfficialSBI) March 4, 2022
Also read: Railway Tickets: రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ కోసం ఇకపై క్యూ లైన్ అవసరం లేదు!
Also read: LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ వాయిదా.. వచ్చే వారమే అధికారిక ప్రకటన?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook