SBI Alert For Account Holders: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. కోట్లాది ఖాతాదారులు నిర్ణీత గడువు ముగిసేలోగా కేవైసీ(KYC) ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఓ ప్రకటన విడుదల చేసింది. లేని పక్షంలో మీ స్టేట్ బ్యాంక్ ఖాతాలు సర్వీసులు అందించవని స్పష్టం చేసింది.
తుది గడువు ఇదే..
భారతీయ స్టేట్ బ్యాంకుకు దేశంలో అత్యధిక సంఖ్యలో ఖాతాదారులు ఉన్నారు. ఈ ఖాతాదారులు మే నెల 31వ తేదీ లోగా కేవైసీ చేయించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో ఎస్‌బీఐ ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయనున్నామని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కనుక ఖాతాదారులు మీకు అకౌంట్ ఉన్న బ్రాంచ్‌లోగానీ, మీకు దగ్గర్లోని స్టేట్ బ్యాంక్‌లోగానీ KYC డాక్యుమెంట్స్ సమర్పించేందుకు అవకాశం కల్పించింది. దేశంలో అత్యధికంగా ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India) సేవలు అందిస్తోంది.
Also Read: Gold Price In Hyderabad 03 May 2021: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, అదే దారిలో వెండి
Important announcement for our customers in view of the lockdowns in place in various states. #KYCUpdation #KYC #StayStrongIndia #SBIAapkeSaath #StaySafe #StayStrong pic.twitter.com/oOGxPcZjeF
— State Bank of India (@TheOfficialSBI) May 1, 2021
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మే 31వరకు గడువు పొడిగించారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా కేవైసీ పూర్తి చేసుకోని పక్షంలో అకౌంట్ తాత్కాలికంగా పనిచేయదని, బ్యాంక్ సేవలు నిలిపివేయనున్నామని ఖాతాదారులకు తెలిపింది. కరోనా సమయం కనుక నేరుగా బ్యాంకుకు వెళ్లలేని పక్షంలో పోస్టు ద్వారాగానీ, ఈ మెయిల్ ద్వారా కేవైసీ డాక్యుమెంట్స్ సమర్పించాలని సూచించింది. కేవైసీ పూర్తయ్యాక అందుకు సంబంధించిన తాజా వివరాలు మీ ఫోన్‌కు అందుతాయి.
Also Read: QR Codesపై తన ఖాతాదారులకు SBI అలర్ట్, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook