Samsung Galaxy F54 5G Price And Features : ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అయిన ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్. ఫీచర్స్ పరంగా ఈ ఫోన్ అదరగొడుతోంది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్, వివో, రెడ్‌మి, ఒప్పో, రియల్‌మి లాంటి స్మార్ట్ ఫోన్ మేకర్స్ మధ్య విపరీతమైన పోటీ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ మేకింగ్ కంపెనీలు సైతం ఆ పోటీని తట్టుకుని నిలబడేందుకు పోటాపోటీగా ఎప్పటికప్పుడు ఏవో కొన్ని యాడెడ్ ఫీచర్స్‌తో కొత్త కొత్త ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. అలా శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిందే ఈ శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్.
శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో చెప్పుకోదగిన ముఖ్యమైన ఫీచర్స్ లో ఈ ఫోన్ బ్యాటరీ పవర్. 6,000mAh శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు. యూజర్ రివ్యూస్ ప్రకారం ఈ మొబైల్ ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే.. సాధారణ వినియోగం అయితే రెండు రోజులు పూర్తిగా.. ఒకవేళ అధికంగా వినియోగించినట్టయితే, ఒక్క రోజు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F54 5G ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే.. 120Hz రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల అమోల్డ్ FHD+ డిస్‌ప్లే లభిస్తుంది. హై రిఫ్రెష్ రేట్ వల్ల సోషల్ మీడియా యాప్స్‌తో పాటు గేమింగ్ యాప్స్ వినియోగం, నావిగేషన్ సులభతరం అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న విజన్ బూస్టర్ కూడా విజిబిలిటి క్వాలిటీని పెంచుతుంది.
శాంసంగ్ గెలాక్సీ F54 5G ఫింగర్ ప్రింట్ సెన్సార్ సూపర్ స్పీడ్‌తో పనిచేస్తుంది. 6,000mAh బ్యాటరీ అమర్చి ఉన్నప్పటికీ.. ఫోన్ 8.4 ఎంఎం థిక్‌నెస్‌తో ఎంతో స్లిమ్‌గా కనిపిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాను ఏర్పాటు చేశారు. అందులో ప్రైమరీ కెమెరా 108 MP కలిగి ఉంది. సోషల్ మీడియా యూజర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి ఆకర్షణీయమైన షాట్స్ చిత్రీకరించేందుకు ఈ ఫోన్ రైట్ ఛాయిస్.
ఇక పర్‌ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో ఎక్సీనోస్ 1380 5nm ప్రాసెసర్ అమర్చారు. మల్టీటాస్కింగ్ హ్యాండిల్ చేయడంలో ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుందని యూజర్ రివ్యూస్ చెబుతున్నాయి.
ఇక ఆడియో విషయానికొస్తే.. ఇదే సెగ్మెంట్‌లో ఉన్న ఇతర ఫోన్స్‌లో తరహాలో డ్యూయల్ స్పీకర్స్ కాకుండా ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఇచ్చారు. అయితే, ఆ సింగిల్ స్పీకర్ సైతం హై వాల్యూమ్ స్పీకర్ అయి ఉండటంతో ఇందులోనూ ఎలాంటి ఫిర్యాదు లేదనే తెలుస్తోంది.
అడ్వాంటేజెస్ అన్నీ చెప్పుకున్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా చెప్పుకోవాలి కనుక.. ఈ ఫోన్‌లో ఉన్న కొద్దిపాటి డిమెరిట్ ఏదైనా ఉందా అంటే.. అది 25W వార్ప్ స్పీడ్ చార్జర్ అందివ్వడం. ఇటీవల కాలంలో వస్తోన్న ఫోన్స్ అన్నీ కనీసం 45W కి తగ్గకుండా ఇంకా అంతకంటే ఎక్కువ స్పీడ్ చార్జర్స్ ని అందిస్తుండగా.. ఇక్కడ 25W కే పరిమితం అవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసే అంశం. అయితే, చార్జింగ్ స్పీడ్ అనేది కేవలం ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ చార్జింగ్ అవుతుంది అనే అంశం తప్పించి ఫోన్ పర్‌ఫార్మెన్స్‌తో సంబంధం లేని విషయం అనేది గుర్తుంచుకోవాలి.