KYC New Rules: దేశంలో పెరిగిపోతున్న ఆన్‌లైన్ నేరాలు, మనీ లాండరింగ్‌ను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ నో యువర్ కస్టమర్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఆర్బీఐ నిర్ణయం ప్రకారం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు కేవైసీను ఎప్పటికప్పుడు నిర్వహింంచేలా ఆర్బీఐ నిర్దేశిస్తుంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ మాస్టర్ గైడ్‌లైన్స్‌ను సవరించింది. ఆర్బీఐ సవరణ ప్రకారం ఇకపై బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ఆర్బీఐ నియంత్రణలో కస్టమర్ల కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే కేవైసీ ఇకపై మరింత కఠినతరం కావచ్చు. కొత్త సవరణల ప్రకారం రెగ్యులేటెడ్ సంస్థల ప్రిన్సిపల్ ఆఫీసర్లకు ఈ బాధ్యత ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫీసర్ అంటే సంబంధిత రెగ్యులేటెడ్ సంస్థలు నియమించిన యాజమాన్యం తరపు అధికారి.
ఇందులో కస్టమర్ ఐడెంటిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటాయి. సంబంధిత వ్యాపారం ఉద్దేశ్యం, పనితీరు గురించి రెగ్యులేటెడ్ సంస్థలు సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. కస్టమర్ వ్యాపారం, యాజమాన్య హక్కులు, నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రెగ్యులేటెడ్ సంస్థలు తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో కస్టమర్ బెనిఫిషియరీ ఓనర్ తరపున ఉన్నాడా లేదా అనే వివరాలతో పాటు ఆ బెనిఫిషియరీ ఓనర్ గుర్తింపును కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. రెగ్యులేటెడ్ సంస్థలు సంబంధిత గుర్తింపుని నిర్ధారించాల్సి ఉంటుంది.
Also read: PPF New Rules: పీపీఎఫ్ ఎక్కౌంట్ క్లోజింగ్ నిబంధనల్లో మార్పులు, పెనాల్టీలో మినహాయింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook