Jio Network down: పలు నగరాల్లో నిలిచిపోయిన జియో నెట్‌వర్క్‌ సేవలు, అసహనం వ్యక్తం చేసిన వినియోగదారులు

Jio Network down for many users : జియో వినియోగదారులు నెట్‌వర్క్‌లో సమస్యలు ఉన్నాయంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డౌన్‌డిటెక్టర్‌కు గణనీయమైన రిపోర్టులు వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 04:51 PM IST
  • గంటల తరబడి నిలిచిపోయిన రిలయన్స్ జియో నెట్‌వర్క్‌
  • Jiodown పేరుతో సోషల్‌మీడియాలో పోస్టులు
  • అసహనం వ్యక్తం చేసిన వినియోగదారులు
Jio Network down: పలు నగరాల్లో నిలిచిపోయిన జియో నెట్‌వర్క్‌ సేవలు, అసహనం వ్యక్తం చేసిన వినియోగదారులు

Reliance Jio Network down for many users Downdetector shows a sharp spike: మొన్న ఫేస్‌బుక్‌, (facebook) వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ (instagram) సేవలు దాదాపు ఏడు గంటలపైనే నిలిచిపోయాయి. ఇవ్వాళ జియో నెట్‌వర్క్‌ (Jio Network) పలు నగరాల్లో నిలిచిపోయింది. జియో వినియోగదారులు నెట్‌వర్క్‌లో సమస్యలు ఉన్నాయంటూ సోషల్‌మీడియాలో (social media) పోస్టులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డౌన్‌డిటెక్టర్‌కు గణనీయమైన రిపోర్టులు వచ్చాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్‌‌తో పాటు పలు నగరాల్లో వినియోగదారులంతా జియో నెట్‌వర్క్‌ సమస్యలను ఎదుర్కొన్నారు. 

ఈ సమస్యపై వినియోగదారులంతా సోషల్‌ మీడియాలో (social media) అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జియోకేర్‌ స్పందించింది. జియోకేర్‌ ఒక కస్టమర్‌లకు ఈ విధంగా రిప్లై ఇస్తోంది. జియో ప్రస్తుతం కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటుందని.. తమ టెక్నికల్‌ బృందం దానిపైనే పనిచేస్తోందని చెప్పింది. వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరిస్తామని అని జియోకేర్‌ పేర్కొంది.

Also Read : Ys Jagan Review: ఏపీలో విలేజ్ క్లినిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

సోషల్‌మీడియాలో జియోడౌన్ (Jio down) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే ‘డౌన్‌డిటెక్టర్‌’కు వేలాది ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు 4 వేల మందికి పైగా వినియోగదారులు జియో (Jio) నెట్‌వర్క్‌ సమస్యను నివేదించారు.

Also Read : Shiva lingam: అమావాస్య నాడు ఆకాశంలో అద్భుతం.. మబ్బులతో దర్శనమిచ్చిన శివ లింగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News