Realme GT 2 Pro Sale: ఫ్లిప్‌కార్ట్‌లో 18 వేల వరకూ డిస్కౌంట్, వెంటనే త్వరపడండి మరి..

Realme GT 2 Pro అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యాయి. అత్యాధునిక ఫీచర్లతో..అత్యంత తేలికైన ఈ ఫోన్ ప్రత్యేకతలేంటి, 18 వేల డిస్కౌంట్ ఎలా పొందాలనేది తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 14, 2022, 02:05 PM IST
  • రియల్‌మి జీటీ 2 ప్రో అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం
  • రియల్‌మి జీటీ 2 ప్రో కొనుగోలుపై 18 వేల డిస్కౌంట్ ఎలా పొందాలి
  • రియల్‌మి జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలివే..
Realme GT 2 Pro Sale: ఫ్లిప్‌కార్ట్‌లో 18 వేల వరకూ డిస్కౌంట్, వెంటనే త్వరపడండి మరి..

Realme GT 2 Pro అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యాయి. అత్యాధునిక ఫీచర్లతో..అత్యంత తేలికైన ఈ ఫోన్ ప్రత్యేకతలేంటి, 18 వేల డిస్కౌంట్ ఎలా పొందాలనేది తెలుసుకుందాం.

Realme GT 2 Pro ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్ సేల్ ఆఫర్ ఇది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి ఇటీవల ఈ కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఏప్రిల్ 14వ తేదీ మద్యాహ్నం 12 గంటలకు స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్ని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభించింది. ఈ ఫోన్ తీసుకోవాలంటే త్వరపడండి. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో 18 వేల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. ఎలాగంటే...

రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్  Realme GT 2 Pro ఆన్‌లైన్ వాణిజ్య వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 49 వేల 999 రూపాయల ఖరీదైన ఈ స్మార్ట్‌ఫోన్‌పై 18 వే రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్‌లో లభించే ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

రియల్‌మి జీటీ 2 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్‌లతో 49 వేల 999 రూపాయలు అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఇందులో ఒకవేళ మీరు ఎస్బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే..5 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ మినహాయిస్తే..44 వేల 999 రూపాయలకు లభిస్తుంది.

ఇది కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. దీంతో మీకు 13 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా లభిస్తే..44 వేల 999 రూపాయల ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం 31 వేల 999 రూపాయలకు లభించనుంది. అంటే మొత్తం 18 వేల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.

రియల్‌మి జీటీ 2 ప్రో ఫీచర్లు

ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్  ప్రోసెసర్‌పై పని చేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డు సహాయంతో మెమరీ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్ 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంది. ఇందులో 65 వాట్స్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డీ 2కే ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది.

రియల్‌మి జీటీ 2 ప్రో ఒక ట్రిపుల్ రేర్ కెమేరా సెటప్‌తో వస్తోంది. ఇందులో 50 ఎంపీ మెయిన్ సెన్సార్, 50 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మైక్రోస్కోప్ కెమేరా ఉన్నాయి. అత్యంత తేలికైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా కూడా ఉంది. 

Also read: Renault April Offers: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా... రెనాల్ట్‌లో భారీ ఆఫర్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News