All set to bring a bill in Parliament for regulations and guidelines on cryptocurrencies: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే క్రిప్టోకరెన్సీల నియంత్ర బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. నియంత్రణ నిబంధనలతో పాటు.. క్రిప్టో కరెన్సీ మార్గదర్శకాలు కూడా ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ కరెన్సీని విడుదల చేసేందుకు ఆర్బీఐ కసరత్తు ముమ్మరం (RBI Digital Currecncy) చేసింది.
'క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్, అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021'ను (Cryptocurrency Bill) వచ్చే వారం లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్బీఐకి వీలు కల్పించే విధంగా ఉండనుంది. దీనితో పాటు ఇతర అన్ని ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలపై నిషేధం విధించే విధంగా ఉంటుందని (Cryptocurrency Ban in India) సమాచారం. అయితే క్రిప్టో కరెన్సీల అంతర్గత సాంకేతికత విషయంలో పలు మినహాయింపులు ఉంటాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
గతంలో బ్యాన్ చేసినా..
నిజానికి గతంలో ఓసారి క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ నిషేధం విధించింది. అయితే ఈ విషయంపై ఓ సమాజిక కార్యరకర్త వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. ఆర్బీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. క్రిప్టో కరెన్సీని నిషేధించేందుకు చట్టపరంగా అధికారాలు లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం దేశంలో ఏ క్రిప్టో కరెన్సీపైనా నిషేధం గానీ ఆంక్షలు గానీ లేవు. అందుకే ప్రస్తుతం భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీల నియంత్రణ బిల్లును తీసుకురానుంది.
ఏమిటి ఈ క్రిప్టో కరెన్సీ..
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్వేర్ కోడ్ల ద్వారా పని (What is Cryptocurrency) చేస్తుంటాయి. మనం సాధారణంగా చూసే కరెన్సీలను భౌతికంగా చూడగలం, ముట్టుకోగలం. అయితే క్రిప్టో కరెన్సీని సాఫ్ట్‌వేర్‌తో రూపొందించి కరెన్సీ. కాబట్టి వీటిని భౌతికంగా చూడలేం, ముట్టుకోలేం.
పేరుకు తగ్గట్లుగానే.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తున్నందున క్రిప్టో కరెన్సీల లావాదేవీలను సురక్షితంగా జరుగుతుంటాయి.
Also read: Digital payment: డిజిటల్ లావాదేవీల జోరు- 12 నెలల్లో 53 శాతం వృద్ధి!
Also read: Stock Market today: కుదిపేసిన ఒమిక్రాన్ భయాలు- స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook