FD Rate Hike: రెపో రేటును బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. రుణాలపై వసూలు చేసే వడ్డీ ఎలా పెరుగుతుందో అదే విధంగా ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీ కూడా పెరుగుతుంటుంది. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5 గా కొనసాగుతోంది. ఇంకా మారలేదు. అందుకే చాలా బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు పెంచాయి. ఏ బ్యాంకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచింది. డిసెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. 46 నుంచి 90 రోజుల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 5.25 శాతం, 91-179 రోజులకు 6 శాతం, 180-210 రోజులకు 6.25 శాతం, 211 రోజుల్నించి 1 ఏడాదికి 6.50 శాతం వడ్డీ ఏడాది దాటితే 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
కోటక్ మహీంద్ర బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇటీవలే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. కాల వ్యవధి 3-5 ఏళ్లకు మారుతుంటుంది. 7 రోజుల్నించి 10 ఏళ్ల వరకూ సాధారణ ప్రజల ఎఫ్‌డీలపై 2.75 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకైతే 7 రోజుల్నించి 10 ఏళ్లకు 3.35 శాతం నుంచి 7.80 శాతం వడ్డీ అందిస్తుంది.
డీసీబీ బ్యాంక్
డీసీబీ బ్యాంక్ 2 కోట్లకు తక్కువ ఉన్న పిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీసీబీ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రజల ఎఫ్‌డీలపై 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం వడ్డీ అందిస్తోంది.
ఫెడరల్ బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్ పెంచిన వడ్డీ రేట్లు డిసెంబర్ 5 నుంచే అమల్లోకి వచ్చేశాయి. 500 రోజుల ఎఫ్‌డీపై వడ్డీ రేటును 7.50 శాతానికి పెంచింది. అదే సీనియర్ సిటిజన్లకు మాత్రం 500 రోజులకు 8.15 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక 21 నెలల్నించి 3 ఏళ్ల వరకూ ఉన్న ఎఫ్‌డీలపై 7.80 శాతం వడ్డీ అందిస్తుంది.
Also read: PPF Benefits: నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి 26 లక్షలు పొందే అద్భుత పధకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook