రాకేశ్ ఝున్​ఝున్​వాలా బడ్జెట్ ఎయిర్​లైన్​ 'ఆకాశ' రెండు భారీ డీల్స్​!

Rakesh Jhunjhunwala: బడ్జెట్ విమానయాన సంస్థగా దేశీయ మార్కెట్లోకి రానున్న 'ఆకాశ ఎయిర్​లైన్స్' రెండు భారీ డీల్స్ కుదుర్చుకుంది. విమానాల కోసం బోయింగ్​తో, వాటి ఇంజిన్లకోసం సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో డీల్స్ కుదిరినట్లు ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 10:25 AM IST
  • వేగం పెంచిన ఆకాశ ఎయిర్​లైన్స్​
  • విమానాల కొనుగోలుకోసం బోయింగ్​తో ఒప్పందం
  • ఇంజిన్ల కోసం సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో మరో డీల్​
రాకేశ్ ఝున్​ఝున్​వాలా బడ్జెట్ ఎయిర్​లైన్​ 'ఆకాశ' రెండు భారీ డీల్స్​!

Rakesh Jhunjhunwala: ప్రముఖ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్​ఝున్​వాలా ప్రధాన వాటాదారుగా (Big bull Rakesh JhunJhun wala) ఉన్న ఎయిర్​లైన్​ స్టార్టప్​ 'ఆకాశ'.. కార్యకలాపాలు ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్ ఎయిర్​లైన్ సంస్థగా మార్కెట్లోకి ప్రవేశించనుంది ఈ కంపెనీ.

తాజాగా ఈ కంపెనీ 72 విమానాలను కొనుగోలు చేసేందుకు బోయింగ్‌తో (Akasa Boeing deal) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. విమానాల కొనుగోలు కోసం తమ మధ్య 9 బిలియన్ డాలర్లు (రూ.66,700 కోట్ల పైమాటే) ఒప్పందం కుదిరినట్లు (Akasa Boeing deal Value) ఇరు సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. వచ్చే ఏడాది తొలినాళ్లలో కనీసం 10 విమానాలను డెలివరీ చేసేలా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిసింది.

'737' మాక్స్‌లోని రెండు వేరియంట్లు 737-8, 737-7-200 విమానాల కోసం (Boeing 737 flights) ఆర్డరు పెట్టినట్లు ఆకాశ ఎయిర్‌ ప్రకటించింది.

Also read: 2021-22 క్యూ4లో ఎల్​ఐసీ ఐపీఓ- వివిధ పీఎస్​యూల ప్రైవేటీకరణ కూడా!

Also read: వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధర

ఇంజిన్లకోసం మరో డీల్​

విమానాల కొనుగోలుతో పాటు మరో డీల్​ను కూడా కుదుర్చుకుంది ఆకాశ ఎయిర్​.  దుబాయిలో జరుగుతున్న ఎయిర్‌షోలో.. విమానాలకు కావాల్సిన ఇంజిన్లకోసం సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో (Akasa CFM International deal) మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్​ విలువ రూ.4.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33 వేల కోట్లు)గా తెలిపింది. దీంతో సీఎఫ్‌ఎం లీప్‌-1బీ ఇంజిన్లను అందించనుంది.

Also read: OnePlus Nord 2 Pac-Man smartphone: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర

ఆకాశ గురించి..

ఈ కొత్త ఎయిర్​లైన్​ ఏర్పాటు చేసిన నాలుగేళ్లలోపే 70 విమానాలను కలిగి ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు గతంలో చెప్పారు రాకేశ్ ఝున్​ఝున్​వాలా. రానున్న రోజుల్లో విమాన ప్రయాణాలు పెరగనున్నాయని.. అయినా తమ సంస్థ  అత్యంత తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించనుందని (RakeshJhunJhun wala on Akasa airlines) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఈ సంస్థలో 40 శాతం వాటా రాకేశ్​ ఝున్​ఝున్​ వాలా చేతిలోనే ఉంటుందని సమాచారం. ఆకాశ ఎయిర్​ గత నెలలో సివిల్ ఏవియేషన్​ నుంచి అనుమతులు పొందింది. 

Also read: యమహా నుంచి మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా ?

Also read: బ్లూమ్‌బర్గ్ నివేదిక : అత్యంత ధనిక దేశం ఇప్పుడు అమెరికా కాదు..చైనానే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News