Everyone Should Know about PPF Interest Rate: దేశంలో ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది. అదేవిధంగా భవిష్యత్ అవసరాల కోసం వారిని పెట్టుబడి దిశగా కూడా ప్రోత్సహిస్తోంది. అందుకోసం తీసుకువచ్చిన పథకమే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). ఈ పథకంలో పెట్టుబడిపెట్టేందుకు చాలామంది ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మన పెట్టిన డబ్బు సురక్షితంగా ఉండడంతోపాటు.. ఎక్కువ రాబడి వస్తుండడంతో అందరూ పీపీఎఫ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పథకం నుంచి అనేక ప్రయోజనాలను పొందుతున్నా.. ప్రజలు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారి గురించిన సమాచారం లేకుంటే తరువాత అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
పీపీఎఫ్ పథకం దీర్ఘకాలిక పొదుపు పథకం. ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులను సంప్రదించవచ్చు. పీపీఎఫ్ ఖాతాకు చందాపై హామీ వడ్డీ రేటు అందుబాటులో ఉంది. సెక్షన్ 80సీ కింద ఈ డిపాజిట్లపై మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపును కూడా పొందవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.1 శాతం వడ్డీని ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది.
పీపీఎఫ్ స్కీమ్‌లో అన్ని ప్రయోజనాలు ఉన్నా.. కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వడ్డీ రేటు మెచ్యూరిటీ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. పీపీఎఫ్ పథకం వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ఇది కాలంతో పాటు మారుతూనే ఉంటుంది. ఈ పథకంలో మీకు షార్ట్ టర్మ్‌లో లాభాలు రావు. 15 ఏళ్ల లాంగ్ టర్మ్. ఆ తరువాతే మీ చేతికి డబ్బు వస్తుంది.
పీపీఎఫ్ వడ్డీ రేటు 5వ తేదీ నుంచి నెల చివరి రోజు మధ్య అత్యల్ప బ్యాలెన్స్‌పై లెక్కిస్తారు. ఉదాహరణకు మీ పీపీఎఫ్ ఖాతాలో రూ.20 వేలు ఉంటే.. మీరు నెల 5వ తేదీ తర్వాత అదనంగా రూ.2000 డిపాజిట్ చేస్తే.. మీ వడ్డీ రూ.20 వేలకు మాత్రమే లెక్కిస్తారు. ఐదో తేదీలోపు డిపాజిట్ చేస్తే.. ఆ డబ్బుపై వడ్డీని లెక్కిస్తారు. 5వ తేదీ తరువాత డిపాజిట్ చేస్తే.. వచ్చే నెలలో లెక్కిస్తారు.
ఇది మ్యూచువల్ ఫండ్ లాగా ఉండదు. అందువల్ల లిక్విడిటీ కొరత ఉంది. మీ డబ్బు సంవత్సరాల తరబడి లాక్ అయి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ల షేర్లు లాగా ఇందులో మీకు వెంటనే డబ్బులు చేతికి రావు. కాకపోతే లోన్‌గా కొంతడబ్బును తీసుకోవచ్చు.
Also Read: Ravindra Jadeja: ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టిన రవీంద్ర జడేజా.. నిజమేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook