PF Plans: పీపీఎఫ్ కోటి రూపాయలు విత్‌డ్రా ఉండాలంటే..ఏం చేయాలి, పీఎఫ్ సేవింగ్ ప్లాన్స్ ఏంటి

PF Plans: పబ్లిక్ పెన్షన్ ఫండ్..పీపీఎఫ్. భవిష్యత్ అవసరాలకు పనికొచ్చే గ్యారంటీ పథకం. మరోవైపు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా. అయితే ఓ ప్రణాళిక ప్రకారం చేస్తే..కోటి రూపాయలవరకూ పొందవచ్చు. అదెలాగంటే  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2022, 06:30 PM IST
PF Plans: పీపీఎఫ్ కోటి రూపాయలు విత్‌డ్రా ఉండాలంటే..ఏం చేయాలి, పీఎఫ్ సేవింగ్ ప్లాన్స్ ఏంటి

PF Plans: పబ్లిక్ పెన్షన్ ఫండ్..పీపీఎఫ్. భవిష్యత్ అవసరాలకు పనికొచ్చే గ్యారంటీ పథకం. మరోవైపు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా. అయితే ఓ ప్రణాళిక ప్రకారం చేస్తే..కోటి రూపాయలవరకూ పొందవచ్చు. అదెలాగంటే

పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో ఉంటుంది. ఆ తరువాత ఎన్నిసార్లైనా సరే వ్యవధి పెంచుకోవచ్చు. పీపీఎఫ్‌లో ఓ ప్రణాళిక ప్రకారం పెట్టుబడి పెడితే విత్‌డ్రా చేసుకునే సమయానికి కోటి రూపాయలవరకూ సమకూర్చుకోవచ్చు. పీపీఎఫ్‌లో పెట్టుబడి అనేది నూటికి నూరుశాతం గ్యారంటీ పథకం. ప్రభుత్వం హామీతో పాటు మంచి రాబడి ఉండే స్కీమ్ ఇది. మరోవైపు ఆదాయపు పన్నుశాఖ నుంచి అంటే సెక్షన్ 80సి ప్రకారం ఏడాదికి 1.50 లక్షలవరకూ పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఏడాది వడ్డీ 7.10-8 వరకూ అందుతుంది.

పీపీఎఫ్‌లో నెలకోసారి లేదా 3-6 నెలలకోసారి లేదా ఏడాదికోసారి డిపాజిట్ చేయవచ్చు. ఏడాదికి 5 వందల నుంచి డిపాజిట్ ప్రారంభించవచ్చు. విత్‌డ్రా చేసుకునే సమయానికి కోటి రూపాయలు సమకూరాలంటే మాత్రం ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలి. మధ్యలో అడ్వాన్స్ తీసుకోవడం లేదా రుణం తీసుకోవడం చేయకూడదు. ఒక ఆర్దిక సంవత్సరంలో 1.50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టే అవకాశమున్నందున కోటి రూపాయల విత్‌డ్రాకు ఏం చేయాలనేది పరిశీలిద్దాం..పీపీఎఫ్ గరిష్ట పరిమితి 1.50 లక్షలు కాబట్టి..కోటి రూపాయల కోసం 25 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగించాలి. 

పీఎఫ్ ప్లాన్స్, నెలకు ఎంత, వడ్డీ ఎంత

నెలకు 12 వేల 50 వందల రూపాయల చొప్పున ఏడాదికి 1 లక్షా 50 వేల రూపాయలు 25 ఏళ్లపాటు కొనసాగిస్తే 1.03 కోట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో వడ్డీ మొత్తమే 65 లక్షల వరకూ ఉంటుంది. నెలకు 12 వేల చొప్పున ఏడాదికి 1 లక్షా 44 వేలైతే..26 ఏళ్లలో 1.07 కోట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో వడ్డీ మొత్తం 70 లక్షల వరకూ ఉంటుంది. ఇక నెలకు 5 వేల చొప్పున ఏడాదికి 60 వేల రూపాయలు 37 ఏళ్లపాటు కొనసాగితే 83 లక్షల రూపాయల వడ్డీ మొత్తంతో కలిపి 1.05 కోట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. నెలకు 6 వేల చొప్పున ఏడాదికి 72 వేల రూపాయలు 34 ఏళ్లపాటు కొనసాగితే 76 లక్షల వడ్డీమొత్తంతో కలిపి 1.01 కోట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. నెలకు 7 వేల చొప్పున ఏడాదికి 84 వేల రూపాయలు 32 ఏళ్లపాటు కొనసాగితే వడ్డీమొత్తం 74 లక్షలతో కలిపి 1.01 కోట్లు విత్‌డ్రా చేయవచ్చు. ఇక నెలకు 8 వేలు ఏడాదికి 96 వేల రూపాయలు 31 ఏళ్లలో 77 లక్షల వడ్డీతో కలిపి 1.06 కోట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు.

మెచ్యురిటీ అనేది 15 ఏళ్లు పూర్తయిన తరువాత ఐదేసి సంవత్సరాలు పెంచుకుంటూ పోవల్సి ఉంటుంది. అంటే 15 ఏళ్లు పూర్తయిన తరువాత తిరిగి 20 ఏళ్లకు, తరువాత 25 ఏళ్లకు, ఆ తరువాత 30 ఏళ్లకు పెంచాల్సి ఉంటుంది. 

Also read: New Wage Code: జూలై 1 నుంచి తగ్గనున్న జీతం, పెరగనున్న రిటైర్మెంట్ ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News