PPF Account: నెలకు 5 వేలు, మెచ్యురిటీ తరువాత 42 లక్షల రూపాయలు..ఎలాగో తెలుసుకోండి

PPF Account: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్. భవిష్యత్ సెక్యూరిటీకి అద్భుతమైన రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ముఖ్యంగా ఉద్యోగుల కోసం ఉద్దేశించిన బెస్ట్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 16, 2023, 12:24 PM IST
PPF Account: నెలకు 5 వేలు, మెచ్యురిటీ తరువాత 42 లక్షల రూపాయలు..ఎలాగో తెలుసుకోండి

PPF Account: పీపీఎఎఫ్ స్కీంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉన్నా లేదా ఇప్పటికే ఇన్వెస్ట్ చేసినా ఈ శుభవార్త మీ కోసమే. పీపీఎఫ్ స్కీంలో పెట్టుబడి పెట్టినవారికి కేంద్ర ప్రభుత్వం 42 లక్షల రూపాయలు అందిస్తుంది. నిజంగా ఇది అద్బుతమైన ప్రయోజనం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలంటే పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ మంచి ఫథకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనిది కావడంతో రిస్క్ ఏ మాత్రం ఉండదు. అద్భుతమైన రిటర్న్స్ లభిస్తాయి. ప్రభుత్వం నుంచి ఏకంగా 42 లక్షల రూపాయలు పొందవచ్చు. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం పీపీఎఫ్ అనేది మంచి ప్రత్యామ్నాయం. ప్రతి యేటా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో  కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్‌లో ఉండే ఒడిదుడుకులు ఏవీ ఈ పథకంపై ప్రభావం చూపించవు. 

మరి 42 లక్షలు ఎలా వస్తాయి

పీపీఎఫ్ పథకంలో నెలకు 5 వేల జమ చేయాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి 60 వేలు జమ అవుతాయి. ఇలా మీరు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం మీ డబ్బులు 16 లక్షల 27 వేల 284 రూపాయలౌతాయి. ఆ తరువాత ఐదేళ్ల చొప్పున పదేళ్లకు డిపాజిట్ చేస్తే అంటే మొత్తం 25 ఏళ్ల తరువాత  42 లక్షలు అందుకోవచ్చు. ఇందులో మీరు జమ చేసే డబ్బులు 15 లక్షలైతే వడ్డీ రూపంలో వచ్చేది 26 లక్షలుంటుంది. 

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌ను మీరు 500 రూపాయలతో ప్రారంభించవచ్చు. సమీపంలోని పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకులో ఎక్కడైనా ప్రారంభించుకోవచ్చు. 2023 జనవరి 1 నుంచి ప్రభుత్వం పీపీఎఫ్ స్కీముపై 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. పీపీఎఫ్ పథకాన్ని ట్యాక్స్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. సెక్షన్ 80 సి ప్రకారం కట్టే డబ్బులతో పాటు దానిపై వచ్చే వడ్డీకు కూడా ట్యాక్స్ ఉండదు. ఐదేళ్లు పూర్తయిన తరువాత లోన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read: PM Kisan Amount: పీఎం కిసాన్ డబ్బులొచ్చేశాయి, మీ ఖాతాలో 2 వేలు పడ్డాయా లేదా, లేకపోతే ఇదీ కారణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News