Post Office Schemes: పోస్టాఫీసులు అందించే వివిధ రకాల పధకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటు మార్చింది. దాదాపుగా 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కొన్ని రకాల పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ పెరిగింది. అందుకే పోస్టాఫీసు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో 9,999 రూపాయలు పెట్టుబడి పెడితే 9 లక్షల రూపాయలు తీసుకోవచ్చు.
స్మాల్ సేవింగ్ పధకాలపై కేంద్ర ఆర్ధిక శాఖ ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. ఫలితంగా 5 ఏళ్ల రకరింగ్ డిపాజిట్ పథకం మరింత ఆకర్షణీయంగా మారింది. ఈసారి 30 బేసిస్ పాయింట్లు పెంచడంతో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై 6.2 శాతం కాకుండా 6.5 శాతం వడ్డీ అందుతోంది. మరోవైపు 1 ఏడాది, 2 ఏళ్ల డిపాజిట్ పధకాలపై 10 బేసిస్ పాయింట్లు వడ్డీ పెరిగింది. మీడియం టెర్మ్ ఇన్వెస్టర్లకు ఇది మంచి ఆప్షన్. వార్షిక వడ్డీ 6.5 శాతం వడ్డీ లభిస్తోంది. వడ్డీ లెక్కకట్టేది, సమీక్షించేది మాత్రం ప్రతి మూడు నెలలకోసారి. కనీస మొత్తం డిపాజిట్ 100 రూపాయలు కాగా ఆపై ఎంతైనా పెంచుకోవచ్చు. అయితే బ్యాంకుల్లో ఉన్నట్టు కాకుండా పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్లు 5 ఏళ్లకు ఉంటాయి. ఐదేళ్లు పూర్తయ్యాక మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ప్రకారం 10 వేలు డిపాజిట్ చేస్తే 7.10 లక్షలు అందుకోవచ్చు. నెలకు 10 వేల చొప్పున ఐదేళ్లు డిపాజిట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం 6 లక్షలు కాగా 1 లక్షా 10 వేల వడ్డీతో కలిపి 7 లక్షల 10 వేలు చేతికి అందుతాయి. ప్రతినెలా 1 వతేదీ నుంచి 15వ తేదీలోగా పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్లో 12 వాయిదాలు చెల్లించిన తరువాత రుణం తీసుకునే అవకాశముంటుంది. రికరింగ్ డిపాజిట్‌పై లభించే వడ్డీ కంటే 2 శాతం అధికంగా ఉంటుంది. సరిగ్గా ఐదేళ్ల కాల పరిమితికి ఒక్కరోజు ముందు మీ రికరింగ్ డిపాజిట్ క్లోజ్ చేస్తే సేవింగ్ ఎక్కౌంట్‌పై అందించే వడ్డీ లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook