Fuel Price Cut: భారీగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుత రేట్లు ఇవే..

Petrol price Today: పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే రికార్డు స్థాయిలో రేట్లను తగ్గించినట్లు తెలిపాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 08:16 AM IST
Fuel Price Cut: భారీగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుత రేట్లు ఇవే..

Petrol Price in India: సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంధన ధరలు గురువారం (Fuel price hiked) రికార్డు స్థాయిలో దిగొచ్చాయి.

పెట్రోల్, డీజిల్​ భారీగా తగ్గించినట్లు చమురు మార్కెటింగ్​ కంపెనీలు (OMC) తెలిపాయి. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

మొన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలకు అనుగుణంగా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోయాయి ఓఎంసీలు.

దీపావళి కానుక..

ప్రజలకు దీపావళి కానుకగా..  పెట్రోల్‌, డీజిల్‌లపై (petrol, diesel ) ఎక్సైజ్‌ సుంకం (Excise duty) తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది కేంద్రం. లీటర్ పెట్రోల్‌పై (petrol) రూ.5లు, లీటర్ డీజిల్‌పై (diesel) రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని సూచించింది.

Also read: INDIA vs AFG: టీ20 వరల్డ్​కప్​లో ఖాతా తెరిచిన భారత్- అఫ్గాన్​పై ఘన విజయం

Also read: Petrol, Diesel prices: కేంద్రం దీపావళి కానుక.. పెట్రోల్‌, డీజిల్ ధరల తగ్గింపు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుత ధరలు ఇలా..

హైదరాబాద్​లో పెట్రోల్ (Petrol price in Hyderabad) ధర లీటర్​ రూ.6.29 తగ్గి.. రూ.108.18 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Hyderabad) రూ.12.76 దిగొచ్చి.. రూ.94.61 వద్ద ఉంది.

వైజాగ్​లో లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు వరుసగా రూ.6.10, రూ.12.28 చొప్పున తగ్గాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర (Petrol price in Vizag) రూ.109.03 వద్ద, డీజిల్ ధర (Diesel price in Vizag) రూ.95.17 వద్ద ఉన్నాయి.

Also read: Facebook face-recognition tool: ఫేస్​బుక్ సంచలన నిర్ణయం- త్వరలో ఆ ఫీచర్​ మాయం!

Also read: Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్‌.. త్వరపడండి!

ఇతర మెట్రో నగరాల్లో ఇంధన ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol Price in Delhi) రూ.6.07, డీజిల్ ధర లీటర్​ రూ.11.73 తగ్గింది. దీనితో పెట్రోల్, డీజిల్ (Diesel Price in Delhi) ధరలు లీటర్​కు వరుసగా.. రూ.104.01, రూ.86.71 వద్ద ఉన్నాయి.

చెన్నైలో పెట్రోల్ ధర (Petrol Price in Chenni) లీటర్​ రూ.5.27 తగ్గి.. రూ.101.38 వద్ద ఉంది. లీటర్ డీజిల్ (Diesel Price in Chenni) ధర రూ.11.15 తగ్గి.. రూ.91.42 వద్దకు చేరింది.

బెంగళూరులో పెట్రోల్ ధర (Petrol Price in Bengaluru) లీటర్​ రూ.6.29 తగ్గి రూ.107.62 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.12.45 (Diesel Price in Bengaluru) తగ్గి రూ.92.02 వద్దకు చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్​ రూ.5.87 తగ్గి (Petrol Price in Mumbai)రూ.109.96 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.12.46 దిగొచ్చి.. రూ.94.13 వద్ద (Diesel Price in Mumbai) కొనసాగుతోంది.

కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్​కు.. రూ.5.82, రూ.11.75 పైసల చొప్పున తగ్గాయి. దీనితో లీటర్​ (Petrol Price in Kolkata) పెట్రోల్ ధర రూ.104.65 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్​ (Diesel Price in Kolkata) రూ.89.78 వద్ద కొనసాగుతోంది.

Also read: OnePlus into Electric vehicles market: విద్యుత్ వాహనాల తయారీ రంగంపై వన్​ ప్లస్​ ఆసక్తి!

Also read: Diwali Offer: బంపరాఫర్.. కొత్త ఇంటర్నెట్ కనెనక్షన్లపై రూ. 500 డిస్కౌంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News