Petrol-Diesel Price: దేశవ్యాప్తంగా స్థిరంగా ఇంధన ధరలు...పెట్రోల్-డీజిల్ ధరలు ఏ నగరంలో ఎంత?

Petrol Diesel Price update: ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త రేటును విడుదల చేశాయి. వరుసగా 9వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మీ నగరం యొక్క తాజా ధరను ఇక్కడ తెలుసుకోండి  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 08:34 AM IST
Petrol-Diesel Price: దేశవ్యాప్తంగా స్థిరంగా ఇంధన ధరలు...పెట్రోల్-డీజిల్ ధరలు ఏ నగరంలో ఎంత?

Petrol-Diesel Price Today 30th May: దేశవ్యాప్తంగా ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol-Diesel Price Today) స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంధన రేట్లలో చమురు కంపెనీలు  ఎలాంటి మార్పు చేయలేదు. మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మే 21న పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది.  ఫలితంగా లీటరు పెట్రోలు 9.50 రూపాయలు, డిజిల్‌పై 7 రూపాయలు తగ్గింది. 

నేటి ధర ఎంత?
>>ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్‌ రూ.89.62
>>ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28
>>చెన్నై పెట్రోల్‌ రూ.102.63, డీజిల్‌ రూ.94.24
>>కోల్‌కతా పెట్రోల్‌ రూ.106.03, డీజిల్‌ రూ.92.76
 >>హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.66, డీజిల్‌ రూ.97.82
>>తిరువనంతపురంలో పెట్రోలు రూ.107.71, డీజిల్ లీటరుకు రూ.96.52
>>పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోలు రూ. 84.10 మరియు డీజిల్ లీటరుకు రూ. 79.74
>>బెంగళూరులో పెట్రోలు రూ.101.94, డీజిల్ లీటరుకు రూ.87.89

Also Read: Whatsapp Storage Details: ఏ మెస్సేజెస్‌ను వాట్సప్ స్టోర్ చేస్తుంది, ఎంతవరకూ మీ డేటా సురక్షితం

ఈ ఏడాది ధర ఎంత మారింది?
2022 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 1, 2022న రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.95.41, డీజిల్ లీటరుకు రూ.86.67కు ఉండేది. ఆ తర్వాత పెట్రోలు, డీజిల్ ధరల్లో పలుమార్లు మార్పులు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఏప్రిల్‌ 6 వరకు పెట్రోల్‌, డీజిల్‌పై దాదాపు రూ.10 పెరిగింది. అయితే మే 21న కేంద్ర ప్రభుత్వం చొరవతో ప్రజలకు మరోసారి ఊరట లభించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News