Fuel price hike: గత ఏడాది నవంబర్ నుంచి స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఉక్రెయిన్ విషయంపై అమెరికా, రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా క్రూడ్ ఆయిల్ ధర ఏడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర (బ్రెంట్) 95 డాలర్లకు చేరింది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 2022 ప్రారంభంతో పోలిస్తే.. ముడి చమురు ధరలు ప్రస్తుతం 23 శాతం వరకు పెరిగాయి. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
దేశంలో ధరలు ప్రస్తుతం ఎందుకు పెరగటం లేదు?
దేశీయంగా ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ధరలు పెంచితే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపొచ్చని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనేది పూర్తిగా చమురు మార్కెటింగ్ సంస్థలకు సంబంధించిన విషయమే. అయినప్పిటీక దేశంలో ప్రధాన కంపెనీలైన ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటివి ప్రభుత్వం రంగ సంస్థలుగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆయా సంస్థలు నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రస్తుతం ఎన్నికల పర్వం నడుస్తున్న కారణంగా.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటీక.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం పెంపు లేకుండా కేంద్రం కట్టడి చేస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.
మరి ప్రస్తుతం వస్తున్న విశ్లేషణల ప్రకారం.. ఎన్నికలు ముగిసి వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
- దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.45 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.86.71 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18 వద్ద, డీజిల్ ధర లీటర్ రూ.94.61 వద్ద ఉన్నాయి.
- విశాఖపట్నంలో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్‌కు) వరుసగా రూ.109.03, రూ.95.17 వద్ద కొనసాగుత్నాయి.
Also read: Flipkart Mi Smart TV: రూ.30 వేల విలువైన Mi స్మార్ట్ టీవీ.. ఇప్పుడు రూ. 10,499లకే అందుబాటులో!
Also read: LIC Share Value: ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత భీమా సంస్థగా ఎల్ఐసీ, ఒక్కొక్క షేర్ విలువ ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook