Paytm mini App Store: పేటీఎం నుంచి మొబైల్ యాప్ స్టోర్.. గూగుల్‌కి ఝలక్ ఇద్దామనా ?

Paytm launches android mini app store | న్యూ ఢిల్లీ: పేటీఎం తమ వ్యాపారంలో మరో అడుగు ముందుకేసింది. గూగుల్ ప్లే స్టోర్ ( Google play store ) తరహాలో పేటీఎం సొంతంగా ఆండ్రాయిండ్ మిని యాప్ స్టోర్‌ని ( Paytm mini app store ) లాంచ్ చేసింది. ఇండియన్ డెవలపర్స్ తమ డిజిటల్ ప్రోడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకోవడానికి వీలుగా పేటీఎం మినీ మొబైల్ యాప్ స్టోర్ జీరో చార్జెస్‌తో సేవలు అందించనుంది.

Last Updated : Oct 5, 2020, 06:07 PM IST
Paytm mini App Store: పేటీఎం నుంచి మొబైల్ యాప్ స్టోర్.. గూగుల్‌కి ఝలక్ ఇద్దామనా ?

Paytm launches android mini app store | న్యూ ఢిల్లీ: పేటీఎం తమ వ్యాపారంలో మరో అడుగు ముందుకేసింది. గూగుల్ ప్లే స్టోర్ ( Google play store ) తరహాలో పేటీఎం సొంతంగా ఆండ్రాయిండ్ మిని యాప్ స్టోర్‌ని ( Paytm mini app store ) లాంచ్ చేసింది. ఇండియన్ డెవలపర్స్ తమ డిజిటల్ ప్రోడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకోవడానికి వీలుగా పేటీఎం మినీ మొబైల్ యాప్ స్టోర్ జీరో చార్జెస్‌తో సేవలు అందించనుంది. ఈ మినీ యాప్‌ స్టోర్‌ ప్రత్యేకతలు ఏంటంటే... మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే ఈ యాప్ స్టోర్‌ని ఉపయోగించుకోవచ్చు. మొబైల్‌ వెబ్‌సైట్‌ ( Mobile website ) ద్వారా నేరుగా యాప్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చని పేటీఎం వెల్లడించింది. దీనివల్ల డెవలపర్స్‌కి లబ్ధి జరగడమేకాకుండా యూజర్స్‌కి కూడా డేటాను, మెమొరీని ఆదా చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేటీఎం స్పష్టంచేసింది. Also read : IT Returns filing: ఐటి రిటర్న్స్ ఇంకా దాఖలు చేయలేదా ?

డెకాథలాన్, ఓలా, పార్క్ +, రాపిడో, నెట్‌మెడ్స్, 1 ఎంజి, డొమినోస్ పిజ్జా, ఫ్రెష్‌మెను, నోబ్రోకర్ వంటి 300 కి పైగా మొబైల్ యాప్స్ ఇప్పటికే పేటీఎం మొబైల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకొచ్చాయి. అనలిటిక్స్ చెక్ చేసుకోవడానికి వీలుగా డాష్‌బోర్డ్ కూడా ఉంది. ఎంచుకున్న పలువరు వినియోగదారుల ఫోన్లలో బీటా వెర్షన్ అందుబాటులో ఉంది. తక్కువ ఖర్చుతో హెచ్‌టీఎంఎల్‌ ( HTML script based apps), జావా స్క్రిప్ట్‌ ( Java script based apps ) ఆధారంగా డెవలప్‌ చేసిన యాప్స్‌కి కూడా తమ మినీ యాప్స్ స్టోర్‌లో చోటు ఉందని పేటీఎం పేర్కొంది. Also read : SBI offers on loans: కరోనా కాలంలో రుణాలపై ఎస్బీఐ ఆఫర్స్

పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌శేఖర్‌ శర్మ ( Paytm founder, CEO Vijayshekhar Sharma ) ఈ పేటీఎం మినీ యాప్ స్టోర్ గురించి మాట్లాడుతూ.. మన దేశానికి చెందిన యాప్‌ డెవలపర్స్‌కి సరైన అవకాశాలు అందిపుచ్చుకునేలా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ మినీ యాప్‌ స్టోర్‌ను ప్రారంభించామని అన్నారు. పేమెంట్స్ విషయంలోనూ ఎటువంటి చార్జీలు లేకుండా సేవలు అందించే విధంగా మినీ యాప్ స్టోర్ ( Mini app store ) పనిచేస్తుందని సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. Also read : Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇటీవలే థర్డ్ పార్టీ పేమెంట్ ట్రాన్సాక్షన్ విషయంలో పేటీఎం తమ ప్లే స్టోర్ యాప్ నిబంధనలు ( Play store rules ) ఉల్లంఘించిందనే కారణంతో పేటీఎం యాప్‌ని గూగుల్ సంస్థ ప్లే స్టోర్‌లోంచి ( Google removed Paytm from playstore ) తొలగించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత పేటీఎం తమ తప్పు సరిదిద్దుకోవడంతో గూగుల్ తిరిగి పేటీఎం యాప్‌ని ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే పేటీఎం ఇలా సొంతంగా మొబైల్ మిని యాప్ లాంచ్ చేయడం చూస్తోంటే.. పేమెంట్స్ విషయంలో ఇకపై గూగుల్ ప్లే స్టోర్‌పై ఆధారపడకూడదనే ఉద్దేశంతోనే పేటీఎం ఈ మినీ యాప్ స్టోర్ లాంచ్ చేసినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Also read : Bank Holidays in October 2020: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News